Begin typing your search above and press return to search.
బీజేపీ పై పోరాటానికి ఏపీ పనికొస్తుందా ?
By: Tupaki Desk | 28 Dec 2021 10:17 AM ISTబీజేపీ మీద పోరాటాలు చేయటానికి ఏపీ వేదికగా మారాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపిచ్చారు. గతంలో కేంద్రంపై పోరాటం చేయటంలో ఎన్టీయార్, జ్యోతిబసు, ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళని సీతారాం ప్రస్తావించారు. సీతారాం ఏపీపై చాలా ఆశలే పెట్టుకున్నట్లున్నారు. ఒకపుడు దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఎన్టీయార్ చూపించిన చొరవ లాంటిది ఇపుడు మళ్ళీ ఏపీలో జరగాలని కోరుకుంటున్నారు. సీతారాం ఆలోచనలు, ఆశలు బాగానే ఉన్నా ఆచరణలో జరిగేది కాదు.
ఎందుకంటే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంటే ఎన్టీయార్ ఒంటికాలిపై లేచేవారు. అలాంటి ఆలోచనలే ఉన్నా జ్యోతిబసు, ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు చేతులు కలిపారంటే అప్పట్లో కేంద్ర ప్రభుత్వంపై అందరి వైఖరి ఒకే విధంగా ఉండేది. అందుకనే ప్రతిపక్షాలను ఏకం చేయటానికి ఎన్టీయార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కానీ ఇప్పటి పరిస్దితులు అప్పట్లో లాగ లేవని అందరికీ తెలిసిందే.
చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. కేంద్రంతో ఇద్దరికి ఉన్న అనేక రకాల అవసరాల దృష్ట్యా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీయేకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేసే బాధ్యత ఏపీలో జరిగేందుకు అవకాశాలు లేవు. వీరిద్దరి సంగతిని వదిలేసినా తెలంగాణాలో కేసీయార్ ను కూడా ప్రతిపక్షాలు నమ్మటం లేదు. ఎందుకంటే అవసరానికి తగ్గట్లుగా కేసీయార్ స్టాండ్ మార్చుకుంటుంటారు కాబట్టే.
ఏపీలో జగన్ , చంద్రబాబు ఇద్దరు కేంద్రం ముందు సాగిలపడటం రాష్ట్రానికి పెద్ద దెబ్బనే చెప్పాలి. వీళ్ళవల్ల రాష్ట్రప్రయోజనాలు కూడా దెబ్బతింటున్నాయి. పైగా వీళ్ళిద్దరికీ ఏ విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదరదు. విభజన చట్టం అమలు కావచ్చు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కూడా కేంద్రాన్ని నిలదీయలేని స్ధితిలో ఉన్నారిద్దరు. ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే నరేంద్ర మోడీ ఏపి ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాల ఐక్యత విషయంలో సీతారాం ఏపీపై ఆశలు పెట్టుకోవటం అనవసరమని చెప్పాలి.