Begin typing your search above and press return to search.

తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందా?

By:  Tupaki Desk   |   2 April 2021 10:45 AM IST
తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుందా?
X
ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఇబ్బందులు ఎదురవుతున్న వేళ.. తాజాగా ఒక గులాబీ ఎమ్మెల్యేల విషయంలో.. తెలంగాణ అధికార పార్టీ కొత్త ఇబ్బందుల్ని ఎదుర్కోనుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ వాదనకు బలం చేకూరేలా.. కాంగ్రెస్ నేతల వాదన ఉండటం గమనార్హం. తాజాగా ఎన్నికల అధికారిని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఒక కంప్లైంట్ చేశారు.

2009.. 2018 ఎన్నిలక సందర్భంగా రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లు.. అసెంబ్లీ వెబ్ సైట్లో ఆయన బయోడేటా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేటయానికి ఆయన సమర్పించిన పత్రాలకు సంబంధం లేదన్న మాట వినిపిస్తోంది. కోర్సు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్లను పరిశీలిస్తే.. వివిధ సందర్భాల్లో తన విద్యార్హతల విషయంలో ఆయన పొంతన లేని సమాచారాన్ని ఇచ్చినట్లుగా శశిధర్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

స్వీడన్ లో బీటీహెచ్ వర్ిసటీ నుంచి బీటెక్.. ఎంఎస్ చేసినట్లుగా తప్పుడు వివరాలు ఇచ్చారని.. పీజీ కంప్లీషన్ సర్టిఫికేట్ కోసం కనీసం 60 క్రెడిట్ పాయింట్లు రావాల్సి ఉండగా.. రోహిత్ సమర్పించిన సర్టిఫికేట్ లో 30 పాయింట్లు మాత్రమే వచ్చినట్లుగా ఉందని చెబుతున్నారు. డిగ్రీగా ఇది చెల్లుబాటు కాదని.. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి దొంగ ఓటు వేశారని మండిపడుతున్నారు. ఈ అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు వాస్తవమని తేలితే.. అనర్హత వేటు తప్పదంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.