Begin typing your search above and press return to search.

ఆస్తుల స్వాధీనం.. యోగి గ్రేట్ అంట..

By:  Tupaki Desk   |   28 Dec 2019 7:09 AM GMT
ఆస్తుల స్వాధీనం.. యోగి గ్రేట్ అంట..
X
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా యూపీలో హింస పెచ్చరిల్లిన సంగతి తెలిసిందే.. దాదాపు 21మంది వరకూ ఆందోళనల్లో పోలీసు కాల్పుల్లో చని పోయారు. యూపీ లో చాలా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను నిరసన కారులు ధ్వంసం చేశారు. వారందరినీ గుర్తించిన యూపీ సర్కారు ఇప్పుడు ఆ నష్ట పరిహారాన్ని వారినుంచే కక్కిస్తోంది. హింసకు దిగిన వారి ఆస్తులను చేజిక్కించుకొని బాధితులకు అందజేస్తోంది.

దాదాపు 498 మందిని హింసకు పాల్పడినట్టు గా గుర్తించిన పోలీసులు వారికి నోటీసులు అందజేశారు. మీరట్ లోనే 148మందిని గుర్తించారు. వీరందరికీ నష్ట పరిహారం చెల్లించాల్సింది గా ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు.

తాజాగా దీనిపై సీఎం యోగి ఆధిత్యనాథ్ కార్యాలయం ట్విట్టర్ లో స్పందించింది. ‘సీఎం యోగి హింసకు పాల్పడిన వారి పై కఠిన చర్యలకు దిగుతున్నారు. వారంతా భయపడి విస్తు పోతున్నారు. అల్లరి చేయాలనుకున్న వాళ్లంతా ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. ఇప్పుడు హింస కు పాల్పడ్డ వారు పరిహారం చెల్లిస్తుండడం తో వారంతా ఏడుస్తూ ఉన్నారు. యూపీలో ఉంది యోగి ప్రభుత్వం.. గ్రేట్ సీఎం’ అంటూ ట్వీట్ చేసింది.

ఇలా యోగి తనకు తానే డబ్బా కొట్టుకునేలా కార్యాలయం నుంచి చేసుకున్న ట్వీట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. యోగి చేసింది చూసి బయటవాళ్లు మెచ్చుకోవాలని.. మీరు కాదంటూ కౌంటర్ ఇస్తున్నారు.