Begin typing your search above and press return to search.

వార్ రూం లోకి వెళితేనే సోనియా లెక్క తేలుస్తారా?

By:  Tupaki Desk   |   12 Nov 2019 6:07 AM GMT
వార్ రూం లోకి వెళితేనే సోనియా లెక్క తేలుస్తారా?
X
మహా రాష్ట్ర లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వార్ రూం లో నిర్వహించే భేటీతో ఒక క్లారిటీ వస్తుందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటాని కి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీని మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానిస్తే.. కమలనాథులు తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కుదరదన్న సంగతి తెలిసిందే.

అనంతరం బంతిని శివ సేన కోర్టు లో విడిచారు గవర్నర్. 56 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆ పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సోమవారం రాత్రి 7.30 గంటల వరకూ సమయం ఇచ్చారు. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన బలాన్ని చూపించాలని కోరారు. ఉదయం నుంచి బిజీ బిజీగా గడిపినప్పటి కీ గడువు వేళకు మాత్రం కాంగ్రెస్.. ఎన్సీపీ ల నుంచి మద్దతు లేఖ ను తీసుకు రావటంతో విఫలమైంది. మరిన్ని చర్చలకు మరో రెండు రోజుల టైం కావాలని అడగ్గా.. అందుకు గవర్నర్ నో చెప్పేశారు.

అదే సమయం లో 54 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్సీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారు. వారికి సైతం మంగళవారం సాయంత్రానికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని ప్రదర్శించాల్సిందిగా కోరారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును ఎవరికి ఇవ్వాలన్న సింగిల్ లైన్ ఎజెండాపై సోమవారం ఉదయం నుంచి నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకుండా నే వాయిదా పడింది.

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయిన సోనియా.. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యం లో ఈ రోజు (మంగళవారం) మరోమారు పార్టీ కోర్ గ్రూపుతో సమావేశం కానున్నారు. శివసేనకు మద్దతు ఇవ్వటం తో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఎంత ఉంది?దాని పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశం పై చర్చలు జరుపుతారని.. అనంతరం వార్ రూం భేటీని నిర్వహిస్తారని చెబుతున్నారు. వార్ రూం భేటీ లోనే ఫైనల్ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మంగళవారం రాత్రి 8.30 గంటల వరకు ఎన్సీపీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి గవర్నర్ సమయం ఇవ్వటం తో.. అప్పటిలోపు ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.