Begin typing your search above and press return to search.

`సోఫియా`తో విల్ స్మిత్ డేటింగ్...వైర‌ల్ వీడియో!

By:  Tupaki Desk   |   30 March 2018 1:04 PM GMT
`సోఫియా`తో విల్ స్మిత్ డేటింగ్...వైర‌ల్ వీడియో!
X
``ఇనుములో ఓ హృద‌యం మొలిచెనే....ముద్దిమ్మంటూ న‌న్నే పిలిచెనే.....``రోబో సినిమాలో ఐశ్వ‌ర్యా రాయ్ ను ఉద్దేశించి రోబో పాడిన ఈ పాట బాగా పాపుల‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో ఐష్ ను చిట్టి ప్రేమించ‌డం....రొమాంటిక్ ఊహ‌ల్లో తేలిపోవ‌డం తెలిసిందే. అదే త‌ర‌హాలో నిజ జీవితంలో రూపొందించిన సోష‌ల్ హ్యూమ‌నాయిడ్ రోబో సోఫియాతో హాలీవుడ్ హీరో విల్ స్మిత్ డేట్ కు వెళ్లాడు. ఆ సంద‌ర్భంగా సోఫియాను స్మిత్ ముద్దు పెట్టుకోబోయాడు. అయితే, వెంట‌నే సోఫియా....అచ్చం అమ్మాయిలాగే స్పందించి వారించ‌డంతో ఆ హాలీవుడ్ హీరో షాక్ అయ్యాడు. సోఫియా - స్మిత్ ల డేటింగ్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. మనుషుల హావభావాలను తెలుసుకుని మనుషుల్లాగే ఆలోచించి, మాట్లాడ‌గ‌లిగే సోష‌ల్ హ్యూమనాయిడ్‌ రోబో సోఫియాను హాంకాంగ్‌ కు చెందిన హాన్‌ సన్‌ రోబోటిక్స్ తయారు చేసిన సంగ‌తి తెలిసిందే. కృత్రిమ మేధ రంగంలో సంచ‌ల‌నం రేపిన సోఫియాను రెండేళ్ల నుంచి ప‌రీక్షిస్తున్నారు. సోఫియా వయసు పసిబిడ్డ స్థాయి మేధస్సును కనబరుస్తూ...పెద్ద‌వాళ్ల త‌ర‌హాలో మాట్లాడుతుంది.

కేమన్‌ ద్వీపాల్లో సోఫియాతో స్మిత్ డేట్ కు వెళ్లాడు. ఎలాగోలా మాయ మాట‌లు చెప్పి సోఫియాను స్మిత్ బుట్ట‌లో ప‌డేయాల‌నుకున్నాడు. అయితే, నిజ జీవితంలో అమ్మాయిల లాగే సోఫియా కూడా స్మిత్ ప‌ప్పులు ఉడ‌క‌నివ్వ‌లేదు. వారిద్ద‌రి `డేట్` సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా సాగింది. స్మిత్ ఆఫర్ చేసిన వైన్ ను సోఫియా రిజెక్ట్ చేసింది. మెల్ల‌గా జోక్ చెప్పి ఫ్ల‌ర్ట్ చేయాల‌న్న స్మిత్ ఆలోచ‌న‌ను ప‌సిగ‌ట్టిన సోఫియా...త‌న‌కు జోక్స్ నచ్చ‌వ‌ని చెప్ప‌డంతో స్మిత్ చిన్న‌బోయాడు. త‌న‌ను సిలికాన్‌ - ప్లాస్టిక్‌ - కార్బన్‌ ఫైబర్లతో తయారు చేశార‌ని, ఎలక్ట్రానిక్‌ మ్యూజిక్‌, హిప్‌-హాప్‌ మ్యూజిక్ త‌న‌కిష్ట‌మ‌ని సోఫియా చెప్పింది. స్మిత్‌ సినిమాల్లోని పాటలు నచ్చ‌లేద‌ని మొహం మీదే చెప్పేసింది. ఇక లాభం లేద‌నుకున్న స్మిత్....చిన్న‌గా సోఫియాను ముద్దు పెట్టబోయాడు. త‌న‌ను స్నేహితుడిగా భావిస్తున్నానంటూ సోఫియా క‌న్నుగీటడంతో స్మిత్ కు షాక్ త‌గిలింది. ఇక లాభం లేద‌నుకొని స్మిత్ వేరే టాపిక్ అందుకుని సోఫియాతో త‌న చాట్ కంటిన్యూ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

వీడియో కోసం క్లిక్ చేయండి