Begin typing your search above and press return to search.
ఎన్ కౌంటర్ చేశాడు.. ఇప్పుడు ఆ చిక్కులు సజ్జనార్ కే..
By: Tupaki Desk | 27 Sep 2021 4:41 PM GMTదిశా నిందితుల ఎన్ కౌంటర్ తో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాడు అప్పటి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్. తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన వారంతా దిశ నిందితుల ఎన్ కౌంటర్ తో పూలు చల్లేలా సజ్జనార్ చేశాడు. ఇప్పటికీ ఎంతో మంది అక్రమార్కులను ఎన్ కౌంటర్ లో లేపేసిన చరిత్ర సజ్జనార్ సొంతం. తెలుగు ప్రజల్లో సజ్జనార్ కు ఒక డైనమిక్ ఆఫీసర్ గా మంచి పేరుంది. అయితే దిశ ఎన్ కౌంటర్ తో ఎంత పేరు వచ్చిందో అంతే విమర్శలు వచ్చాయి.
దిశ ఎన్ కౌంటర్ కు సజ్జనార్ చేసిన న్యాయానికి ప్రజామోదం లభించినా.. చట్టాలు మాత్రం ఆయనను దోషిగానే చూశాయి. దీనిపై సుప్రీంకోర్టు నియమించిన ‘సిర్పూర్కర్ కమిషన్’ ప్రస్తుతం దిశ ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తోంది. అందరిని ప్రశ్నించిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఈ ఎన్ కౌంటర్ లో కీరోల్ పోషించిన సజ్జనార్ విచారణకు రంగం సిద్ధమవుతోంది.
సజ్జనార్ ను సైతం ప్రశ్నించాలని సిర్పూర్కర్ కమిటీ నిర్ణయించి సమన్లు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లో ఆయనను ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు దిశ హత్యాచారం, ఎన్ కౌంటర్ పై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ గా మహేష్ భగవత్ ను నియమించింది. ఇప్పటికే ఆయన పలుమార్లు విచారణ కమిషన్ ముందు హాజరయ్యారు.
అయితే ఎన్ కౌంటర్ లో ఆయన పాత్ర లేదు. కేవలం వివరాలు చెప్పడం వరకే చేస్తున్నారు. కానీ ఎన్ కౌంటర్ చేసిన సజ్జనార్ ను కమిషన్ విచారించడానికి రెడీ అయ్యింది. కమిషన్ లేవనెత్తుతున్న సందేహాలను క్లియర్ చేయడంతో తడబడుతుండడం సజ్జనార్ కు ఇబ్బంది కరంగా మారే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.
సిర్పూర్కర్ కమిషన్ కనుక ఎన్ కౌంటర్ బూటకమని నివేదిక ఇస్తే సజ్జనార్ కెరీర్ లో తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని తెలుస్తోంది. విచారణ తర్వాత సిర్పూర్కర్ కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.