Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ విషయంలో రష్యా రిస్కు తీసుకుంటుందా?
By: Tupaki Desk | 6 Dec 2020 11:00 PM ISTఓవైపు కరోనా దూకుడు.. మరోవైపు వ్యాక్సిన్ వేసేయటం ద్వారా కంటికి కనిపించని మహమ్మారికి చెక్ పెట్టాలన్న రష్యా ప్రయత్నం ఇప్పుడు పలు ప్రశ్నల్ని లేవెనెత్తుతోంది. రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ పై పరీక్షలు పూర్తి స్థాయిలో పూర్తి కాక ముందే.. ప్రజలకు ఇచ్చేందుకు ప్రభుత్వం మహా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓవైపు క్లినికల్ టెస్టులు పూర్తిస్థాయిలో కాకముందే.. వ్యాక్సిన్ సెంటర్లను ఓపెన్ చేసేసి.. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని షురూ చేసింది. ఎవరికి ముందు వ్యాక్సిన్ వేయాలన్న అంశంపై ఇప్పటికే విధివిధానాలు సిద్దం చేయటంతో పాటు.. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని గతంలోనే నిర్వహించటంతో.. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యాక్సిన్ ఇస్తున్నారు.
ఇందుకోసం దేశవ్యాప్తంగా పన్నెండుకు పైగా వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించారు. ఇదంతా బాగానే ఉన్నట్లు కనిపించినా.. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సక్సెస్ రేటు 95 శాతంగా చెబుతున్నప్పటికి.. వాస్తవంగా ఇదెలా పని చేస్తుందన్న దానిపై చాలానే సందేహాలు ఉన్నాయి. దీంతో వ్యాక్సినేషన్ ప్రారంభం కావటంతో ఏం జరుగుతుందన్న ఆందోళన ఇప్పుడు పలువురిని వేధిస్తోంది. తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు ఇవ్వటం మొదలు పెట్టిన రష్యా.. పెద్ద రిస్కు తీసుకుంటున్నట్లుగా కొందరు భావిస్తున్నారు. అయితే.. ఎలాంటి విపరిణామాలు చోటు చేసుకోవని పుతిన్ ప్రభుత్వం ధీమాగా ఉంది.
ఈ వ్యాక్సిన్ ను రెండు దశల్లో ఇస్తారు. మొదటి డోస్ ఇచ్చిన 21 రోజుల తర్వాత రెండో డోస్ ఇస్తారు. అయితే.. వ్యాక్సిన్ డోసులు ఎన్ని ఉత్పత్తి అయ్యాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రష్యా రాజధాని మాస్కోలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో తొలుత నగరానికి చెందిన వారికి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ షురూ చేశారు. శనివారం మొదలైన ఈ కార్యక్రమం.. ఈ రోజు (ఆదివారం) మరింత జోరుగా కొనసాగించనున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులకు.. ఆర్మీలో పని చేసే లక్ష మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. రానున్న రోజుల్లో వీటి ఫలితాలు ఎలా ఉంటాయన్నదే అసలు ప్రశ్న.