Begin typing your search above and press return to search.
ప్రీగా కరోనా వ్యాక్సిన్ తేల్చిన సీఎం పళని.. తెలుగు రాష్ట్రాల సీఎంలు మాట్లాడరేం?
By: Tupaki Desk | 24 Oct 2020 10:00 AM ISTఇప్పటికిప్పుడు రాదు కానీ.. మరికొద్ది నెలల్లో కరోనా వ్యాక్సిన్ విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన డిబేట్ లోనూ ఇదే విషయాన్ని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరికొద్ది వారాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని ట్రంప్ చెబితే.. లేదు మరికొంత టైం పడుతుందని బైడెన్ పేర్కొన్నారు. ఇటీవల దేశ ప్రధాని మోడీ సైతం వ్యాక్సిన్ త్వరలో వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వచ్చినంతనే బీహార్ ప్రజలకు తొలుత అందిస్తామన్న మాటలు రాజకీయ రచ్చకు తెర తీశాయి. ప్రస్తుతం బిహార్ ఎన్నికలు జరుగుతున్న వేళలో.. ఎన్నికల్లో మైలేజీ కోసం ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే..ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వని రీతిలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి ఆసక్తికర నిర్ణయాన్ని వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందరికి ఉచితంగా ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. ఎంత ఖర్చు అయినా.. ప్రభుత్వమే భరిస్తుందని.. ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని చెబుతున్నారు. సీఎం పళని నోటి నుంచి వచ్చిన మాట.. ప్రజలకు భారీ రిలీఫ్ గా మారిందంటున్నారు.
ఎవరికి వారు వ్యాక్సిన్ విషయంలో.. స్పందిస్తున్న వేళ.. వినూత్న పథకాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాక్సిన్ విషయంలో తమ విధానాన్ని ప్రకటిస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఒకవైపు వ్యాక్సిన్ పై తమ వాదనల్ని వినిపిస్తుంటే.. విధానపరంగా తామేం చేయనున్న విషయాన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రకటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాక్సిన్ పై తెలుగు ముఖ్యమంత్రుల నోట ఏ మాట వస్తుందో చూడాలి.