Begin typing your search above and press return to search.

ప్రియాంక పీఎం సీటు నల్లేరుపై నడకేనా? ఎందుకంటే?

By:  Tupaki Desk   |   12 Aug 2020 4:40 PM IST
ప్రియాంక పీఎం సీటు నల్లేరుపై నడకేనా? ఎందుకంటే?
X
ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూతురు ప్రియాంకగాంధీ దూసుకొస్తోంది. రాహుల్ గాంధీ ఫెయిల్ అయిన వేళ కాంగ్రెస్ రాజకీయాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ముందడుగు వేస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను చేరదీసి మళ్లీ కాంగ్రెస్ తో కలపడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు దేశ కాంగ్రెస్ రాజకీయాలను సమూలంగా మార్చేసేందుకు ప్రియాంకగాంధీ అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రియాంక గాంధీ ఈ మధ్య కాంగ్రెస్ పార్టీపై మంచి పట్టు సాధిస్తోంది. రాహుల్ ఇప్పటికే ఓసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఫ్లాప్ కావడంతో ఇప్పుడు ఆయన మీద ఉన్న అపవాదును పోగొట్టడానికి ప్రియాంకకు పట్టం కట్టి భర్తీ చేయాలని కాంగ్రెస్ లో ఒక వర్గం వాదన వినిపిస్తోంది.

ఎందుకంటే ప్రియాంక గాంధీ అయితే ఇందిరాగాంధీ స్టైలో ఉంటుంది. ఇందిరలా మహిళా ఓట్లను ఆకర్షించగలదు. ఇందిర లాంటి చురకుదనం.. భారీతనంతో ఉట్టిపడటం.. ఇవన్నీ ఆమెకు ప్లస్ గా ఉన్నాయి. ఇంకా రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఉత్తర భారతంలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీకి అన్ని సీట్లు వచ్చే పరిస్థితి కనిపించడం లేదట.. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ పుంజుకుంటున్నాయని అంటున్నారు. రాజస్థాన్ లో సచిన్ పైలెట్ మళ్లీ కలిశాడు గనుక యూత్ ఫాలోయింగ్ కాంగ్రెస్ కే ఉంది. మెరుగైన సీట్లు వస్తాయని ఒక అంచనా..

మధ్యప్రదేశ్ లో బీజేపీ వీక్ అవుతోంది. బిహార్ లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. పశ్చిమ బెంగాల్ లో మళ్లీ మమతా బెనర్జీ మెజారిటీ సీట్లు కొట్టే చాన్స్ ఉంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన అలియన్స్ అయితే బీజేపీ మైనస్ లో పడుతుందని అంటున్నారు. ఢిల్లీలో ఉండే సీట్లు తక్కువ. ఇంకా సౌత్ ఇండియాలో తెలంగాణలో కాంగ్రెస్ కు మెరుగైన సీట్లు వస్తాయని అంటున్నారు. ఏపీలో టీడీపీతో పొత్తు అంటున్నారు. కొన్ని సీట్లైనా వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. తమిళనాడులో డీఎంకే స్వీప్ చేసే చాన్స్ ఉంది. కేరళలో కాంగ్రెస్ కు కొన్ని సీట్లు వస్తాయి.

ఇలా ఎటు చూసుకున్నా బీజేపీ కంటే కాంగ్రెస్ కు ఎంపీ సీట్లు తక్కువ వచ్చినా ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. బీజేపీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎలాగూ ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయి కాబట్టి వాళ్ల మద్దతుతో ప్రియాంక గాంధీకి పీఎం అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో..