Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా?
By: Tupaki Desk | 10 Dec 2020 11:00 AM ISTఅన్నిసార్లు ఆవేశం పనికి రాదు. ఆలోచనతో ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునే వీలుంది. అంతేనా.. గొడవల్ని సర్దుబాటు చేసుకోవటంతో పాటు.. అపార్థాల్ని.. అపోహల్ని తీర్చుకోవటం.. పెరిగిన దూరాన్ని తగ్గించటానికి సరైన ఆలోచన అంతో ఇంతో సాయం చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి విషయాలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికి తెలీదని చెప్పాలి.
తనకు ఎదురుగాలి వీస్తుందన్న విషయం ఆయనకు అర్థమైన క్షణం నుంచి ఆయన వ్యవహారశైలి భిన్నంగా మారిపోతుంటుంది. అవసరానికి అనుగుణంగా ఎంత తగ్గాలన్న విషయంపై ఆయనకున్నక్లారిటీ మరెవరికీ ఉండదని చెబుతారు. దుబ్బాకలో బీజేపీ విజయం గాలివాటుగా వచ్చిందనే కన్నా.. టీఆర్ఎస్ చేసిన తప్పుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటమే ప్రధాన కారణంగా చెప్పాలి. ఆ గెలుపుతో వచ్చిన ఉత్సాహంతో ఏమీ లేని గ్రేటర్ లో తెలంగాణ అధికారపక్షానికి గడగడలాడేలా చేయగలిగారు కమలనాథులు.
ఇప్పటివరకు పోల్ మేనేజ్ మెంట్ లో తాను అనుసరించిన వ్యూహాన్ని మరింత దూకుడుగా బీజేపీ అమలు చేయటంతో.. తనకున్న బలం ఏపాటిదన్న విషయాన్ని కేసీఆర్ అర్థం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కాలం తనకు అనుకూలంగా లేని వేళ.. గాలి తనకు ప్రతికూలంగా వీస్తున్న సందర్భంతో పాటు తన బలమైన తెలంగాణ ప్రజల్లో తనపైనా.. తన ప్రభుత్వంపైనా ఆగ్రహం ఉందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఇంతకాలం మోడీ సర్కారుపై అవసరమైన ప్రతి సందర్భంలోనే విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఢిల్లీ పర్యటనను పెట్టుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ రాజధానికి చాలా తక్కువగా వెళుతుంటారు. కేసీఆర్ లాంటి వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. కీలకమైన భేటీలకు ఈ మధ్యన తన కొడుకును పంపిస్తున్న పరిస్థితి. అలాంటిది ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా ఢిల్లీ పర్యటనకు రెఢీ కావటం చూస్తుంటే.. భారీ వ్యూహంతోనే ఆయన హస్తిన టూర్ ఉందన్న మాట వినిపిస్తోంది.
మూడు రోజులు ఢిల్లీలో ఉండనున్న ఆయన.. తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేయటంతో పాటు.. ప్రధాని మోడీని కలవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రధాని టైం కోసం కేసీఆర్ కార్యాలయం సంప్రదింపులు మొదలు పెట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ కు మోడీ టైమిస్తారా? అన్నది ప్రశ్న. ప్రధాని కార్యాలయం సానుకూలంగా లేని పక్షంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ టైం అడుగుతున్నారన్న విషయాన్ని బయటకువెల్లడించే అవకాశం ఉండదు. ఆ వివరాల్ని వెల్లడించారంటే.. మోడీ.. కేసీఆర్ భేటీ జరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు.
కేసీఆర్ ఢిల్లీ పర్యటన వ్యూహాత్మకమని చెప్పాలి. ఎందుకంటే.. రైతుల నిరసనలతో కేంద్రం ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇచ్చి.. భారత్ బంద్ లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానిని కలవటం కేంద్రానికి అంతో ఇంతో ప్లస్ అవుతుందనే చెప్పాలి. కేంద్రానికి అవసరమైన సమయంలో అండగా నిలిచానన్న భావన కలిగించేందుకే కేసీఆర్ తాజా పర్యటన ఉందా? అన్నది మరో ప్రశ్న. తెలంగాణ భవన్ నిర్మాణానికి అవసరమైన భూమి ఇచ్చి కొంతకాలమైంది. ఇప్పటివరకు భూమిపూజ గురించి పెద్దగా ఆలోచించని కేసీఆర్.. అనూహ్యంగా ఇప్పుడా అంశాన్ని తెర మీదకు తీసుకురావటం చూస్తే.. తాజా ఢిల్లీ పర్యటన వ్యూహాత్మకమని చెప్పాలి. దేశ రాజధానిలో మూడు రోజుల పాటు ఉండే కేసీఆర్.. ఆ సందర్భంగా చేసే వ్యాఖ్యలు.. ఆయన పాల్గొనే కార్యక్రమాలు ఆయన ఏం చేయనున్నారన్న విషయాన్ని తెలిసేలా చేసే వీలుంది.