Begin typing your search above and press return to search.

చ‌వితి త‌ర్వాత‌.. బెజ‌వాడ‌లో రాజ‌కీయం మారుతుందా?

By:  Tupaki Desk   |   29 Aug 2022 8:30 AM GMT
చ‌వితి త‌ర్వాత‌.. బెజ‌వాడ‌లో రాజ‌కీయం మారుతుందా?
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ప్రాంతం విజ‌య‌వాడ‌.  ఇక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాలు ఎప్పుడూ.. ఆస‌క్తిగానే ఉంటున్నాయి. అధికారంలో ఉన్న పార్టీల‌కు.. ప్ర‌తిపక్షంలో ఉన్న పార్టీల‌కు కూడా ఈ న‌గ‌రం కీల‌క‌మే. ఎందుకంటే.. గ‌త రెండు ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. వైసీపీ, టీడీపీల‌కు.. అనుకూలంగానే.. ఇక్క‌డ ప్ర‌జ లు ఓటేశారు. 2014లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిస్తే.. ఒక చోట నుంచి వైసీపీ విజ‌యం ద‌క్కించు కుంది. అప్ప‌టి ఎన్నిక‌ల్లో సెంట్ర‌ల్‌, తూర్పు టీడీపీ ఖాతాలో ప‌డ్డాయి. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ చేజిక్కించుకుంది.

అయితే, 2019 నాటికి వ‌చ్చేస‌రికి.. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్ర‌మే టీడీపీ విజ‌యం ద‌క్కించుకోగా.. వై సీపీ.. ప‌శ్చిమ‌, సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ద‌క్కించుకుంది. అంటే.. మొత్తంగా.. ఈ రెండు పార్టీల‌ను కూడా విజ‌య‌వాడ ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. ఇక‌, ఇక్కడి రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్ప‌లేని ప‌రి స్థితి. ఏ నాయ‌కులు ఎటు మార‌తారో.. కూడా తెలియ‌ని ప‌రిస్థితి. గ‌త ఎన్నిక‌ల్లోనూ.. ఇలాంటి సంచ‌ల‌న మార్పులు చోటు చేసుకున్నాయి.

అప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న వంగ‌వీటి రాధా.. టీడీపీలోకి జంప్ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న య‌ల‌మంచిలి ర‌వి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దీంతో విజ‌య‌వాడ రాజ‌కీయ ముఖ చిత్రం ఒక్క‌సారిగా మారిపోయింది. ఇక‌, ఇప్పుడు కూడా ఇలానే భారీ మార్పులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఒక‌రు కాదు.. ముగ్గురు న‌లుగురు వ‌ర‌కు నాయ‌కులు పార్టీలు మారేందుకు రెడీఅయ్యార‌ని స‌మాచారం.

అదికూడా వినాయ‌క చ‌వితి అయిపోయిన వెంట‌నే ఈ మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వీరిలో ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే య‌ల‌మంచిలి ర‌వి.. జ‌న‌సేన‌ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా కీల‌క‌మైన వంగ‌వీటి రాధా.. తిరిగి వైసీపీ గూటికి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రోవైపు.. ఏకంగా ఎంపీ కేశినేని నాని.. త‌న కుమార్తె స‌హా.. పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. మ‌రోవైపు.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి ఇప్ప‌టి వ‌ర‌కు అండ‌గా ఉన్న కొంద‌రు నాయ‌కులు.. పోతిన మ‌హేష్ సారథ్యంలో జ‌న‌సేన బాట‌ప‌ట్టే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇలా.. చ‌వితి త‌ర్వాత‌..బెజ‌వాడ రాజ‌కీయం మ‌రింత వేడెక్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.