Begin typing your search above and press return to search.

ఐటీడీపీ దెబ్బకు పీకే టీం షాక్ అవుతుందా...?

By:  Tupaki Desk   |   13 Sep 2022 11:30 AM GMT
ఐటీడీపీ దెబ్బకు పీకే టీం షాక్ అవుతుందా...?
X
టీడీపీ అనుబంధ సోషల్ మీడియా విభాగం అయిన ఐటీడీపీ ఏపీలో పీకే టీం ని ఆడుకుంటోంది అని అంటున్నారు. ఇక ఐటీడీపీలో మెంబర్స్ కి కనీస జీతాలు నలభై వేలకు తక్కువ కాకుండా ఉంటున్నాయి అని టాక్. దీనికి తోడు అక్కడ ఇంకా బాగా చేస్తే బోనస్ కూడా ఇస్తారట. ఈ విధంగా చూస్తే ఐటీడీపీ మెంబర్స్ దాదాపుగా రెండు లక్షల వరకూ నెలకు సంపాదిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

దీంతో ఇపుడు ఐటీడీపీలో చాలా మంది టాలెంటెడ్ యూత్ పనిచేస్తున్నారు అని చెబుతున్నారు. ఇక ఐటీడీపీ పనితీరు కానీ దాని పని విభజన విధానం కానీ సూపర్బ్ గా డిజైన్ చేసుకున్నారని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక టీం ఉంటే జిల్లా స్థాయిలో మరో టీం పనిచేస్తుంది. ఇక నియోజకవర్గ స్థాయిలో ఇంకో టీం పనిచేస్తుంది. ఇలా టీడీపీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ ని కానీ వైసీపీకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ ని కానీ ఎక్కడ వైరల్ చేయాలో వారికి బాగా తెలుసు అని అంటున్నారు.

దీంతో వారి ముందు వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని ఫీల్డ్ లోకి దిగిన పీకే టీం కి ఇవేమీ తెలియడంలేదు అని అంటున్నారు. ఇక కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2019 ఎన్నికల వేళ వైసీపీకి వాలంటరీగా సోషల్ మీడియా వింగ్ లో చాలా మంది పనిచేశారు కాబట్టి పూర్తిగా సక్సెస్ రూట్ లో కధ నడిచింది. దాంతో పీకే టీం కి కూడా అది చాలా ఈజీ అయింది. ఎక్కడ నుంచి ఏ మ్యాటర్ అయినా చిటికలో వారికి చేరవేసే అంకిత భావం కలిగిన వైసీపీ క్యాడర్ కూడా నాడు దన్నుగా ఉండేది.

ఇపుడు చూస్తే పీకే టీం కి వైసీపీ సోషల్ మీడియా క్యాడర్ సహకారం ఏదీ పెద్దగా దొరకడంలేదుట. ఎవరూ కూడా కనిపించడంలేదుట. దాంతో అసలైన పని ఏంటి అన్నది ఇపుడు వారికి తెలుస్తోంది. అలాగే వారికి ఇది పెను భారంగా అతి పెద్ద సవాల్ గా కూడా మారుతోంది అని అంటున్నారు. ఇక ఐటీడీపీ సోషల్ మీడియ వింగ్ ని చూస్తే గ్రామాల దాకా దూసుకుపోతూ పటిష్టంగా ఉంది. ప్రతీ ఎమ్మెల్యే వెనక ఒక షాడో టీం ని కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఏ న్యూస్ అయినా క్షణాలలో వైరల్ చేయగల సత్తాను వారు సంపాదించారు.

ఏ వైసీపీ ఎమ్మెల్యే అయినా తప్పు చేసినా లేక వారి మీద నెగిటివిటీ వచ్చినా సెకన్ల వ్యవధిలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి రచ్చ రచ్చ చేసి పారేస్తున్నారు. గుక్కతిప్పుకునేల లోపు అది ప్రపంచాన్ని చుట్టేసివస్తోంది. ఇలా ఏదైనా న్యూస్ బ్లాస్ట్ చేసినా బ్రేకింగ్స్ ఇచ్చినా అధికార పార్టీ మైనస్ లని తెచ్చి బయటపెట్టి వైరల్ చేసినా వారికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు కూడా ఐటీడీపీ ఇస్తోంది. దాంతో వారు ఫుల్ ఖుషీగా పని చేస్తున్నారుట.

ఇక పీకే టీం తీరు చూస్తే వైసీపీ క్యాడర్ ని వాలంటరీగా పనిచేయమని కోరుతున్నారుట. దాంతోనే వారికి మండుకొస్తోంది. ఇంతకాలం పార్టీ భుజాలు మోసి అలసిపోయిన తాము ఇంకా ఎలా ఫ్రీగా చేస్తామని అంటున్నారుట. ఇక సోషల్ మీడియా మెంబర్స్ గా ఉన్న వారికి డబ్బులు లేవు, ప్రోత్సాహకాలు లేవు. పైగా మీరు ఫ్రీగా చేస్తే మేము డబ్బులు తీసుకుంటాం, మా గొప్ప మేము చెప్పుకుంటానని ఉన్న పీకే టీం వైఖరితో సోషల్ మీడియా వింగ్ విస్తుబోవడమే కాదు కస్సుబుస్సులాడుతున్నారుట.

దీంతో పేరుకు సోషల్ మీడియా టీం మెంబర్స్ గా పార్టీ నియమించినా ఎవరూ పెద్దగా పనిచేయడంలేదుట. పైగా మాకెందుకీ గొడవ అని సైడ్ అవుతున్నారుట. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటి అంటే వైసీపీ క్యాడర్ కూడా తమకు సాలరీస్ ఇస్తామని ఐటీడీపీ మెంబర్స్ చెబుతూంటే దాని కోసం అందులో చేరి ప్రత్యర్ధి పార్టీకి పనిచేస్తున్నారు అంటేనే వైసీపీ సీన్ ఎలా ఉందో అర్ధమవుతోంది అంటున్నారు.

ఇదే రకమైన తీరు కొనసాగితే పైసా కూడా తీయకపోతే వైసీపీ సోషల్ మీడియా సోష వచ్చి పడిపోయినా ఆశ్చర్యం లేదు. పైగా ఇంటి గుట్టు లంకకు చేటు అన్న తీరున వారంతా కలసి టీడీపీకి సపోర్ట్ చేస్తే కనుక కచ్చితంగా వైసీపీకి అది భారీ దెబ్బగా మారుతుంది. ఎన్నికల్లో ఎపుడూ ఒకే రకమైన వ్యూహాలు పనిచేయవు. పైగా ప్రత్యర్ధి పార్టీలు గట్టిగా సొమ్ములు తీస్తుంటే తాము కూడా క్యాడర్ కోసం విదిలించకపోతే అంతా అయ్యాక తాపీగా విలపించినా కూడా సుఖం లేదు అంటున్నారు. మొత్తానికి ఈ రోజుకు చూస్తే ఐటీడీపీ టీం ఏపీలో టాప్ లో ఉంది. పీకే టీం నే దెబ్బేసేలా ముందుకు సాగుతోంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.