Begin typing your search above and press return to search.
ఆరేళ్ల తర్వాత పెట్రోల్ బైకులు మార్కెట్లో ఉండవా?
By: Tupaki Desk | 23 Sept 2021 12:00 PM ISTనిజమే.. ఇప్పుడు అటు ఇటు కాని సంధి దశలో ఉన్నామని చెప్పాలి. అటు పూర్తిగా పెట్రోల్.. డీజిల్ వినియోగించి వాహనాల్ని నడపలేని పరిస్థితి. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు భారీ బడ్జెట్ పెట్టాల్సి వస్తోంది. మధ్య తరగతి.. దిగువ మధ్యతరగతి వారికి ఇదో ఇబ్బందికరంగా మారింది. ఈ రోజున పెట్రోల్ వాహనం కొనాలా? వద్దా? అన్నది పెద్ద సందేహంగా మారింది. అయితే.. పెట్రోల్ వాహనాల్లో ఉండే సౌలభ్యం.. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల్ని కొనుగోలు చేయాలంటే.. జేబులో ఉన్న డబ్బులన్ని ఖర్చు అయ్యే పరిస్థితి. అందుకే.. అటు రోజువారీగా పెట్రోల్ ఖర్చు పెట్టలేక.. అలా అని విద్యుత్ వాహనాల్ని కొనలేక కిందా మీదా పడిపోతున్నారు.
కొందరు ఏ మాత్రం అవకాశం ఉన్నా.. విద్యుత్ వాహనాలకు షిఫ్ట్ అయిపోతున్న పరిస్థితి. ప్రభుత్వం ప్రోత్సహాకాల్ని అందిస్తున్నట్లు చెప్పినా.. అవేవీ బండి కొనుగోలు చేసేటప్పుడు సగటు జీవికి కనిపించని పరిస్థితి. దీంతో.. పెట్రోల్ వర్సెస్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎవరేం చెప్పినా.. రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని పలువురు స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఎలక్ట్రిక్ కార్లు.. బైకులతో వచ్చిన పెద్ద కష్టమేమంటే.. ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకోవటం. అయితే.. ఇప్పటికిప్పుడు భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అంత సులువైన పరిస్థితి. లేదు.
ఇలాకొన్ని సానుకూలతలు.. మరికొన్ని ప్రతికూలతల నడుమ.. ఎలక్ట్రిక్ట్ వాహనాల ఫ్యూచర్ ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళ.. ప్రఖ్యాత టూ వీలర్ మార్కెట్ దిగ్గజ కంపెనీ హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ మంజాల్ మాట్లాడుతూ.. భారత్ సైతం స్వచ్ఛ ఇంధన దిశగా వేగవంతంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 2027 నాటికి భారత్ లో ద్విచక్ర వాహనాల అమ్మకాల్ని పూర్తిగా విద్యుత్తువే అయి ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
అధిక ధరలు.. ఛార్జింగ్ వసతుల లేమితో భారత్ లో విద్యుత్తు వాహనాల గిరాకీ పెరగటం లేదన్నారు. కార్లతో పోలిస్తే టూ వీలర్ కారణంగానే అత్యధిక వాయు కాలుష్యం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. 2019 నాటికి దేశంలో 29.6కోట్ల టూ వీలర్లు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల తయారీ దిశగా మారేలా కఠిన నిబంధనలు సిద్ధం చేయాలన్నారు. అప్పుడు మాత్రమే కంపెనీలన్ని చిత్తశుద్ధితో నిర్దిష్టమైన లక్ష్యాలతో పని చేస్తాయన్నారు.
ఇప్పటివరకు ప్రఖ్యాత బ్రాండ్లు అన్ని బ్యాక్టరీ బైకుల్ని తయారు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని తాజాగా హీరో ఎలక్ట్రిక్ ఎండీ మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి. మరికొద్ది సంవత్సరాల్లో అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రావాల్సిన అవసరాన్ని చెబుతున్నారు. ఇదంతా విన్నప్పుడు.. టూవీలర్లను కొనుగోలు చేయాలని భావించే వారు.. గతంలో మాదిరి హడావుడి కాకుండా.. మార్కెట్లో జరుగుతున్న పరిణామాల్ని పరిశీలించి.. మదింపు చేసిన తర్వాతే కొత్త బైక్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు.చూస్తుంటే.. మరో ఏడేళ్లకు ఒక మోస్తరు వాళ్లంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ తప్పించి.. పెట్రోల్ వాహనాలు కనిపించవేమో?