Begin typing your search above and press return to search.

ప్రతిపక్షాలు సక్సెస్ అవుతాయా?

By:  Tupaki Desk   |   6 Jun 2022 2:30 PM GMT
ప్రతిపక్షాలు సక్సెస్ అవుతాయా?
X
ప్రతిపక్షాల ఆలోచనలన్నీ ఒకటిగానే ఉన్నాయి. కాకపోతే దారులే ఒకటి కావటం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలనే ప్రతిపక్షాలన్నీ చాలా గట్టిగా ఆలోచిస్తున్నాయి. అయితే ఆలోచన ఉన్నంత మాత్రాన సక్సెస్ కాలేవు. ఆలోచనలు కార్యాచరణలో చూపించినపుడే, అరమరికలు లేని ఐకమత్యంతో కంటిన్యు అయినపుడే కార్యాచరణ సక్సెస్ అవుతుంది. ఈ కార్యాచరణలోనే తేడాలు కనబడుతున్నాయి.

మౌళికమైన తేడా ఎక్కడ కనబడుతోందంటే ముఖ్యమంత్రి కుర్చీ మీదే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కన్నేశారు. త్యాగాలు మీరు చేయాలంటే మీరే ఇంకా తగ్గాలంటు ఒకరిని మరొకరు డిమాండ్లు చేస్తున్నారు.

ఇదే సమయంలో జనసేన మిత్రపక్షం బీజేపీ నేతలు తమ ప్రభుత్వానికి భేషరతుగా మద్దతిస్తేనే పొత్తుకు అంగీకరిస్తామని పరోక్షంగా టీడీపీకి సంకేతాలు పంపుతున్నారు. బీజేపీ సంకేతాలు టీడీపీకి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అందరికీ తెలిసిందే.

రాజకీయంగా క్లైమ్యాక్స్ కు చేరుకుంటున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని ఎట్టి పరిస్థితుల్లోను త్యాగం చేసే అవకాశం లేదు. ఇదే సమయంలో ఇపుడు గనుక సీఎం కాలేకపోతే భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తుందో లేదో అన్నది పవన్ ఆందోళనగా కనబడుతోంది.

అందుకనే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎట్టి పరిస్థితుల్లోను త్యాగాలు చేసేది లేదంటే గట్టిగా చెబుతున్నారు. ఇక్కడే రెండు పార్టీల మధ్య ముడి బిగుసుకుంటోంది. అసలు పవన్ బీజేపీతో ఉంటారా ? లేకపోతే టీడీపీతో వెళ్ళిపోతారా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు.

ఇదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు ఒకటిగా పోటీ చేస్తాయా ? లేకపోతే దేని దారి దానిదేనా అన్నది ఇంకా తేలలేదు. పొత్తు వ్యవహారం తేలాల్సింది ప్రధానంగా టీడీపీ-బీజేపీ మధ్య మాత్రమే. కాకపోతే బీజేపీతో సంబంధం లేకుండా తామిద్దరం పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయో అని బహిరంగంగా ప్రకటించటానికి వెనకాడుతున్నాయి. మరీ పరిస్ధితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా నిరోధించటంలో ప్రతిపక్షాలు సక్సెస్ అవుతాయా ?