Begin typing your search above and press return to search.
మోడీ కేబినెట్ లో కేసీఆర్ ముద్ర!
By: Tupaki Desk | 31 May 2019 11:00 PM ISTటీఆర్ ఎస్ లో హరీశ్ రావును లేకుండా ఊహించగలరా? తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ.. అందులో భాగంగా జరిగిన ఆందోళనలు.. నిరసనలే కాదు.. ఉద్యమంలో కేసీఆర్ వ్యూహాల్ని ఏ మాత్రం పొల్లుపోకుండా అమలు చేసినోళ్లలో హరీశ్ ముందుంటారు. మరి.. అలాంటి హరీశ్ రావు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ ఎస్ ప్రభుత్వంలో మంత్రి స్థానంలో లేకుండా ఉత్త ఎమ్మెల్యేగా ఉంటారని ఊహించగలరా? అస్సలు ఊహించలేదు కదా.
అలాంటి ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ ముందుంటారు. తాజాగా మోడీ కేబినెట్ ను చూస్తే.. కేసీఆర్ మాదిరే మోడీ తీరు కనిపించకమానదు. టీఆర్ ఎస్ లో కీలకమైన హరీశ్ ను పక్కన పెట్టినట్లే.. ఇప్పటికే తన రాజకీయ గురువు అద్వానీని పక్కన పెట్టేసిన మోడీ.. తాజాగా ఆయన ఎంపిక చేసిన కేబినెట్ లో సుష్మాస్వరాజ్ లాంటి సీనియర్ నేతను ఎంపిక చేయకుండా ఉంచటం ఒక నిదర్శనంగా చెప్పక తప్పదు.
సుష్మతో పాటు.. సీనియర్ నేతల్ని ఒక్కొక్కరుగా పక్కన పెట్టేస్తున్న మోడీ.. తన అనుచర వర్గంతోపాటు.. కీలక స్థానాల్లో మోడీ జట్టును ఎంపిక చేస్తున్న తీరు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ప్రస్తుతం మోడీ గాలి వీస్తున్న వేళ.. ఆయన ఏం చేసినా.. వాటిని తప్పు పట్టే పరిస్థితి లేదు. కేసీఆర్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితి.
హరీశ్ ను పక్కన పెట్టేయటం.. ఎందుకన్న విషయంపై ఇప్పటివరకూ ఎలాంటి వివరణ ఇచ్చింది లేదు. అందుకు తగ్గట్లే తెలంగాణ ప్రజలు తాము ఇచ్చే తీర్పును ఎలా మార్చేస్తారన్నది సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని చూస్తే అర్థమవుతుంది. అదే తీరులో.. బీజేపీ సీనియర్ నేతల్ని ఒక్కొక్కరుగా పక్కన పెట్టేస్తున్న తీరు ఎప్పుడో ఒకప్పుడు అందుకు తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న వాదన కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే.. మోడీ కేబినెట్ చూసినప్పుడు.. కొందరిని పక్కన పెట్టిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు రాక మానరు.