Begin typing your search above and press return to search.
ఏపీకి మోడీ గుడ్ న్యూస్ చెబుతారా... ?
By: Tupaki Desk | 9 Feb 2022 11:00 AM ISTకేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఏపీకే పెద్దగా శుభ వార్తలు లేవని విపక్షాలు అంటాయి. ప్రత్యేక హోదా కానీ ప్యాకేజీ కానీ లేవు. ఇక మరో వైపు చూస్తే విభజన హామీలు అన్నీ కూడా అటకెక్కాయి. ఈ నేపధ్యంలో విశాఖ రైల్వే జోన్ కూడా ఇచ్చినట్లే ఇచ్చి పక్కన పెట్టేశారు అని ఏపీతో సహా ఉత్తరాంధ్రా వాసులు మధన పడుతున్నారు.
తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో కూడా విశాఖ రైల్వే జోన్ కి నిధుల కేటాయింపు లేకపోవడంతో జోన్ కి ఇక ఇంతే సంగతులు అని అంతా అనుకున్నారు. దీని మీద మళ్లీ ఉద్యమిస్తామని వామపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏపీ జనాలకు ఒక శుభవార్త అంటున్నారు. రైల్వే జోన్ అన్నది ఎక్కడికీ పోలేదని, ఉత్తరాంధ్రా కలను కేంద్రం సాకారం చేస్తుంది అని అంటున్నారు. దీనికి సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైంది అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఇక విశాఖ రైల్వే జోన్ కోసం కార్యాలయ భవనం నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది అని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. అతి త్వరలోనే రైల్వే జోన్ కూడా సాకారం అవుతుంది అని భరోసా ఇస్తున్నారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, కేంద్రంలోని మోడీ సర్కార్ వల్లనే ఏపీ ప్రగతి సాధ్యమని కూడా జీవీఎల్ అంటున్నారు.
సరే జీవీఎల్ చెప్పిన మాటలను బట్టి చూస్తే ఇప్పటికి డీపీయార్ ఒకటి రెడీ అవుతోంది అన్న మాట. దాని మీద సవరణలు, వివరణలు అన్నీ కూడా జరిగి తుది నివేదిక పూర్తి అయ్యేసరికి మరింత కాలం పడుతుంది, ఈ లోగా ఎన్నికలు వచ్చేస్తాయేమో అని విపక్షాలు సెటైర్లు వేస్తున్నారు.
మళ్ళీ 2024 ఎన్నికలకు ముందు విశాఖ జోన్ అంటూ బీజేపీ నేతలు ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి విశాఖ రైల్వే జోన్ కి ఎంత కేటాయించారో జీవీఎల్ చెప్పాలన్న డిమాండ్ ఉంది. దానికి జవాబు ఆయన చెబితేనే నమ్ముతామని అంటున్నారు. మరి బీజేపీ ఎన్ని వేల కోట్లు ఈ ఏడాది కేటాయించింది అన్నది ఇప్పటికైతే అతి పెద్ద ప్రశ్నగానే ఉంది.