Begin typing your search above and press return to search.
కేటీఆర్ మాటల్ని మోడీ అంత సీరియస్ గా తీసుకుంటారా?
By: Tupaki Desk | 15 July 2022 11:00 PM ISTతండ్రికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మాటలు మాట్లాడటంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిట్ట అన్న సంగతి తెలిసిందే. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అదే పనిగా విమర్శలు చేయటం.. ఘాటు వ్యాఖ్యలు చేయటం ఈ మధ్యన ఆయనో అలవాటుగా మార్చుకున్నారు. తన తండ్రి కమ్ సీఎం కేసీఆర్ మీద ఎవరైనా ఆగ్రహంతో విరుచుకుపడితే.. కేసీఆర్ స్థాయి ఏంటి? విమర్శించినోడి స్థాయి ఏమిటన్నట్లుగా ప్రశ్నించే కేటీఆర్.. తాను మాత్రం ఏకంగా ప్రధాని మోడీని ఉద్దేశించి చేసే వ్యాఖ్యల్లో తీవ్రత ఈ మధ్యన పెరిగింది.
ప్రధాని మోడీని.. కేంద్రంలోని ఆయన సర్కారును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యల్లో తరచూ వినిపించే పదాల్లో ఒకటి జుమ్లా. దీని అర్థం మాటలు చెప్పటమే కానీ చేతల్లో చూపించని వ్యక్తి అని అర్థం. జుమ్లా పేరుతో ప్రధాని మోడీపై తరచూ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ఉంటారు. మంత్రి కేటీఆర్ మాటల్ని ప్రధాని మోడీ చాలా సీరియస్ గా ఫాలో అవుతుంటారా? అన్న సందేహానికి తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది.
తాజాగా కేంద్రం ఒక జాబితాను విడుదల చేస్తూ.. అందులో పలు పదాల్ని ప్రస్తావిస్తూ.. వాటిని పార్లమెంట్ సమావేశాల్లోనూ వాడకూడదని.. ఎందుకంటే ఆ పదాల్ని బ్యాన్ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. పార్లమెంటులో వాడకూడని పదాల్లో మంత్రి కేటీఆర్ నోటి నుంచి తరచూ వచ్చే జుమ్లా ఉండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదంతా చూసినప్పుడు తనను ఉద్దేశించి తెలంగాణరాష్ట్ర మంత్రి కేటీఆర్ నోటి నుంచి వచ్చే ఘాటు వ్యాఖ్యల సారాంశాన్ని మోడీ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారన్న భావన కలుగక మానదు.
ఇదంతా చూసినప్పుడు మంత్రి కేటీఆర్ టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకుంటే.. తన నోటి నుంచి తరచూ వచ్చే మాటను పార్లమెంటులో అన్ పార్లమెంటరీ పదంగా డిక్లేర్ చేసిన వైనం చూస్తే.. కేటీఆర్ ను కేంద్రం సీరియస్ గా తీసుకుంటుందన్న విషయంపై మరింత స్పష్టత వచ్చినట్లుగా చెప్పక తప్పదు.