Begin typing your search above and press return to search.
మళ్లీ మోడీ ప్రధాని కాలేరా... ?
By: Tupaki Desk | 30 Nov 2021 8:00 AM ISTనరేంద్ర మోదీ. ఆయన పేరులో వివేకానందుడి పూర్వ నామధేయం ఉంది. అచ్చం ఆయన మాదిరిగానే యువతకు స్పూర్తిని ఇచ్చే తేజస్సు కూడా మోడీకి ఉంది. మోడీ వేవ్ ఏంటో దేశం 2014 ఎన్నికల్లో చూసింది. ఈ దేశానికి స్వాతంత్రం లభించాక ఆసేతు హిమాచలం జనాలు గట్టిగా నమ్మి ఎత్తున నిలబెట్టిన నాయకులలో ఇందిరాగాంధీ తరువాత మోడీ పేరే చెప్పుకోవాలి. ఇక ఇందిర మాదిరిగానే మోడీ కూడా ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు.ఈ దేశ ప్రజలు మోడీకి రెండు సార్లు ప్రధానిగా అవకాశాన్ని ఇచ్చారు. రెండు సార్లూ ఆయన పూర్తి మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఏడేళ్లకు ముందు మోడీ అంటే పెద్దగా దేశానికి తెలియదు, కానీ ఆయన్ని ఈ దేశ ప్రజానీకం ఎంతగానే విశ్వసించింది. యూపీఏ రెండు దఫాల పాలనలోని అవినీతిని, కుంభకోణాల జమానాని కడిగిపారేసే బలమైన నూతన నాయకత్వాన్ని ఆయనలో చూసింది. అయితే మోడీ జనాల ఆశలను ఎంతవరకూ తీర్చారు అన్న ప్రశ్న వేసుకుంటే జవాబు మాత్రం నిరాశగానే ఉంటుంది. మోడీ రెండవ దఫా పాలనలో జనాలలో ఎన్నో వైఫల్యాలు కనిపిస్తాయని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కరోనా రెండు సార్లు వచ్చి లక్షల మంది చనిపోయారు. కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు తగ్గి కోట్లాది మంది జీవన ప్రమాణాలు మరింతగా దిగజారాయి.
ఇది చాలదన్నట్లుగా భారాలు మోపి మరీ వారి నడ్డి విరగొట్టారు. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన ధరలను అలా నెలల తరబడి పెంచుకుపోవడం వల్ల కేవలం ఏడాదిన్నర వ్యవధిలో ఈ దేశ ప్రజల మీద మోడీ సర్కార్ వేసిన భారం అక్షరాలా 16 లక్షల కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా దేశ బడ్జెట్ కి సరిసమానం అన్న మాట. మరి పేదలను మరింతగా నిరుపేదలు చేసే ఆర్ధిక విధానాల మూలంగా వారు బీజేపీకి, మోడీకి దూరమయ్యారని అంచనాలు ఉన్నాయి. అదే టైమ్ లో ఏడేళ్లలో ఉద్యోగ ఉపాధి రంగాలలో కొత్తగా ఏవీ సృష్టించకపోవడం వల్ల నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది.
కరోనా వేళ ఉన్న చిన్నా చితకా ఉద్యోగాలు కూడా లేకుండా పోయాయి. వీటికి తోడు సాగు చట్టాల మీద రైతుల ఆందోళన ఏడాది పాటు సాగితే వాటిని ఎట్టకేలకు రద్దు చేసుకున్నారు. అయినా ఆ వర్గాలు ఈసారి బీజేపీ వైపు చూస్తాయన్న నమ్మకం అయితే లేదు. ఇక బంగారం లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఒక పాలసీ పెట్టుకుని మరీ ప్రైవేట్ పరం చేయడం ద్వారా కార్మిక వర్గానికి కూడా మోడీ సర్కార్ కన్నెర్ర అయింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలు కచ్చితంగా బీజేపీకి మోడీకి పెను సవాల్ కానున్నాయి అని అంటున్నారు.
మరి ఈ సంగతి తెలిసే అన్నారో లేక యాధృచ్చికంగా మాట్లాడారో కానీ తనకు అధికారం మీద పదవుల మీద వ్యామోహం లేదని మోడీ రీసెంట్ గా సంచలన కామెంట్స్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా మోడీ మాట్లాడుతూ తానే ఎల్లకాలం అధికారంలో ఉండిపోవాలన్న ఆశలు లేనే లేవని మనసులోని మాటను బయటపెట్టారు. మోడీ రాజకీయ చతురుడు. ఆయన మాటల వెనక చాలా అర్ధాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. ఆయన ఈ మాటలు అన్నారూ అంటే వెనక ఏదో పరమార్ధం ఉండే ఉంటుందని కొకూడా మేధావులు చెబుతున్నారు.
ఇక 2024 ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి ఫుల్ మెజారిటీ రాదు అన్నది ఈ రోజు మాట. మరి అప్పటికి ఏదైనా ఎమోషనల్ ఫ్యాక్టర్ పనిచేస్తే ఎవరూ ఊహించని విధంగా బీజేపీ మెజారిటీ సాధించవచ్చేమో. అలా అన్ని సార్లూ జరగదు కాబట్టి ఇప్పటి అంచనాలను బట్టి చూసుకుంటే 200 సీట్ల మార్కుని బీజేపీ దాటితే అదే పెద్ద విజయం అని కూడా భావించే వారు కమలం పార్టీలోనే ఎక్కువగా ఉన్నారు. మరి ఆ పరిస్థితి వస్తే మోడీని ప్రధాని అభ్యర్ధిగా చేసేందుకు బీజేపీలోనే ఎవరు ఒప్పుకుంటారు అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. మిత్ర పక్షాలు, ఇతర రాజకీయ పార్టీల మద్దతు బీజేపీకి అవసరం అయితే మోడీకి ప్రధాని పదవి అందని పండే అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి ఇవన్నీ విశ్లేషించుకునేనా ప్రధాని తనకు పదవుల మీద మోజు లేదని చెప్పారూ అన్న చర్చ అయితే ఉంది. అయితే ఒక్క మాట మాత్రం అంతా ఒప్పుకోవాలి. మోడీ అంటే ఓటమెరుగని వీరుడు. మోడీ అంటే అదృష్ట జాతకుడు. అందువల్ల ఎటు నుంచి ఏమైనా జరిగితే మాత్రం ముచ్చటగా మూడవ సారి ఈ దేశానికి ఆయనే ప్రధాని అయినా కావచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.