Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే రాజాసింగ్ హీరోగా సినిమా చేయనున్నారా?

By:  Tupaki Desk   |   28 Feb 2021 10:42 AM IST
ఎమ్మెల్యే రాజాసింగ్ హీరోగా సినిమా చేయనున్నారా?
X
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికకు ముందు వరకు తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఆయన. తాజాగా ఆయనకు అసెంబ్లీలో తోడు దొరికింది. రాజకీయ నేతలు తరచూ ప్రజల్లో కనిపిస్తుంటారు. రాజాసింగ్ అందుకు మినహాయింపు కాదు.కాకుంటే.. ఆయన తన కోసం కొంత సమయాన్ని జిమ్ లో వెచ్చిస్తుంటారు. చాలామంది రాజకీయ నేతల్లో కనిపించని ఈ విలక్షణ తత్త్వం రాజా సింగ్ సొంతం.

రాత్రి వేళలో యువకులు చౌరస్తాల్లో కూర్చొంటారని.. వ్యాయామం పట్టదని.. ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరని.. అలాంటి వారికి సందేశం ఇచ్చేందుకు తాను జిమ్ కు వెళుతున్నట్లు రాజాసింగ్ పేర్కొంటారు. అంతేకాదు.. త్వరలో ఆయనో సినిమా చేయాలన్న యోచనలో ఉన్నారు. అందుకే భారీగా బరువు తగ్గే ప్లాన్ పెట్టుకున్నట్లు చెప్పారు.

గడిచిన ఐదు నెలల్లో ఆయన బరువులోచాలానే తేడా వచ్చింది. దీనికి కారణం ఆయన చేస్తున్న వర్కౌట్స్. ఇంతకీ అంత కసరత్తు ఎందుకు చేస్తున్నట్లు అన్న విషయాన్ని ఆయన్ని ప్రశ్నించినప్పుడుఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహరాజ్ పైన ఒక సినిమా తియ్యాలన్న కల ఉందని.. ఆ రోల్ తాను చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

‘‘ఆయనది మంచి ఫిజిక్. దేశం కోసం ధర్మం కోసం పోరాడాడు. ఛత్రపతి శివాజీ గురించి అందరికి తెలుసు. కానీ ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ గురించి ఎవరికీ తెలీదు. అందుకే ఆ సినిమా తియాలనుకుంటున్నా. అందుకోసమే ఆయనలా ఒక మంచి ఫిజిక్ కోసం కష్టపడుతున్నా. ఇంతకు ముందు 117 కేజీలు బరువు ఉండేవాడిని. ఇప్పుడు 90 కేజీలకు వచ్చా’ అని అసలు విషయాన్ని వెల్లడించారు.