Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దు అవుతుందా... ?

By:  Tupaki Desk   |   28 Dec 2021 8:00 AM IST
జగన్ బెయిల్ రద్దు అవుతుందా... ?
X
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ మీద ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఏపీలో ఒక ఎంపీ స్థాయి నుంచి ప్రతిపక్ష నేతగా, అక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారు. రెండున్నరేళ్ళపాటు సీఎం గా పదవీకాలాన్ని పూర్తి చేశారు. అయితే జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ వైసీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచినా రఘురామక్రిష్ణం రాజు కోర్టులో పెటిషన్ వేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన ఈ పిటిషన్ వేస్తే దాన్ని విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానం బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

అయితే పట్టు వదలని విక్రమార్కుడిగా మారిన ఆయన హై కోర్టులో తిరిగి పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారు అన్నది ఆయన అభియోగం. దీని మీద హై కోర్టులో విచారణ జరిగింది. తీర్పు ని రిజ‌ర్వులో ఉంచారు.

రఘురామ పిటిషన్ తరఫున ప్రముఖ్య న్యాయవాది వెంకటేష్ వాదించారు. జగన్ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, బెయిల్ రద్దు చేయాలని వాదన వినిపించారు. ఇక ఇక సీబీఐ ఈ కేసు విషయంలో ఇప్పటికే ప్రత్యేకే కోర్టు తన తీర్పుని ఇదివరకే వెలువరించిందని, నాటి నుంచి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. దాంతో విచారణ ముగిసింది. ఇక హై కోర్టు తీర్పుని రిజర్వ్ లో ఉంచింది. అయితే జగన్ బెయిల్ రద్దు మీద హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది మాత్రం ఉత్కంఠంగా ఉంది.

దీని మీద వైసీపీ వర్గాల్లోనూ హాట్ హాట్ చర్చగా ఉంది. మరో వైపు చూస్తే జగన్ రోజు వారీ విచారణకు సీబీఐ కోర్టుకు రావాలని కూడా ప్రత్యేక న్యాయ స్థానం ఆదేశిస్తోంది. దీని మీద తరచూ కోర్టు అనుమతి తీసుకుని జగన్ గైర్ హాజర్ కావడం పట్ల కూడా సీబీఐ హై కోర్టు ఈ మధ్యనే అసహనం వ్యక్తం చేసింది. దాంతో ఆ విషయం ఏమవుతుంది అన్న చర్చ ఉంది. మొత్తానికి చూసుకుంటే కొత్త ఏడాదిలో జగన్ బెయిల్ రద్దు అవుతుందా, అలాగే ఈడీ కేసుల విచారణ కూడా వేగవంతం అయి తుది తీర్పు వస్తుందా, సీబీఐ కోర్టుకు జగన్ ఇక తప్పనిసరిగా హాజరుకావాలా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా సాగుతోంది.