Begin typing your search above and press return to search.

రాజస్ధాన్లో కూడా రిపీటవుతుందా ?

By:  Tupaki Desk   |   31 May 2023 12:33 PM GMT
రాజస్ధాన్లో కూడా రిపీటవుతుందా ?
X
రాబోయే ఎన్నికల్లో రాజస్ధాన్లో మళ్ళీ గెలవాలన్నది కాంగ్రెస్ అధిష్టానం వ్యూహం. ఇందుకోసం కర్నాటక ఫార్ములానే రాజస్ధాన్లో కూడా అమలుచేయాలని కోరుకుంటున్నది. మరి కర్నాటక ఫార్ములా రాజస్ధాన్లో రిపీటవ్వటం సాధ్యమేనా ? ఇపుడిదే మిలియన్ డాలర్ట ప్రశ్న. కర్నాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పెద్దస్ధాయిలో పోరాటాలు ఏమీ జరగలేదు. ఒకళ్ళని మరొకళ్ళు దెబ్బకొట్టుకునేంత స్ధాయిలో వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుకోలేదు. కానీ రాజస్ధాన్లో ఇదంతా జరిగింది.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను దింపేసి తాను ముఖ్యమంత్రి అవ్వాలని సచిన్ పైలెట్ చేయని ప్రయత్నంలేదు. సచిన్ చేసిన ప్రయత్నాల ను గెహ్లాట్ చాలాసార్లు ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు సచిన్ కు అధిష్టానం మద్దతుగా నిలబడింది. మరికొన్నిసార్లు గెహ్లాట్ కు అండదండలందించింది. దాంతో గెహ్లాట్, అధిష్టానం వైఖరి తో విసిగిపోయిన సచిన్ చివర కు పార్టీ ని వదిలేయాలని కూడా అనుకున్నారు. తన మద్దతారులతో సమావేశాలు కూడా పెట్టుకున్నారు.

ఈ నేపధ్యంలో సీన్లోకి రాహుల్ ఎంటరై సచిన్ తో మాట్లాడి సర్దుబాటుచేశారు. అప్పటినుండి సచిన్ దూకుడుతగ్గినా గెహ్లాట్ మీద మండిపోతునే ఉన్నారు. అలాంటిది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరి మధ్య అధిష్టానం సయోధ్య కుదిర్చింది. నిజానికి 2018లో రాజస్ధాన్లో పార్టీ అధికారంలోకి రావటానికి సచినే ముఖ్య కారణం. మెజారిటి సీట్లలో పార్టీ గెలిచిన తర్వాత గెహ్లాట్ ఎంటరై సీఎం కుర్చీ లో కూర్చున్నారు. దాంతో సచిన్ కు మండింది. అప్పటినుండి ఇద్దరి మధ్య గొడవలవుతునే ఉన్నాయి.

సరే జరిగిందేదో జరిగిపోయిందని ఇద్దరినీ కూర్చోబెట్టి మల్లికార్జున ఖర్గే, రాహుల్ లాంటి వాళ్ళ సయోధ్య చేశారు. మరీ సయోధ్య ఎంతకాలం ఉంటుంది ? ఇద్దరు నిజాయితీ గా కష్టపడితే కాంగ్రెస్ గెలుపు సాధ్యమేనేమో. కాకపోతే టికెట్ల కేటాయింపు, ప్రచారం, ఎన్నికల ఖర్చలు తదితరాలన్నింటిలోను ఇద్దరిమధ్య సయోధ్య చాలా అవసరం. మరి తాజా భేటీ లో ఇద్దరిమధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో బయట కు తెలీటంలేదు. బహుశా కాంగ్రెస్ గెలిస్తే సచిన్ కు సీఎం కుర్చీ కట్టబెట్టాలనే ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.