Begin typing your search above and press return to search.
మనోళ్ల కోసం ట్రంప్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన ఎంపీలు
By: Tupaki Desk | 5 Jan 2018 6:53 PM ISTఅవకాశాల స్వరంగా పేరొందిన అమెరికాలో ఆంక్షల కత్తి దూస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అనూహ్యమైన షాక్ తగిలింది. `బై అమెరికన్ - హైర్ అమెరికన్` అన్న ట్రంప్ నినాదంలో భాగంగా కీలకమైన హెచ్1బీ వీసా నిబంధనల్లో మార్పులు తేవాలని నిర్ణయించారు. తగిన నైపుణ్యం కలిగిన అమెరికన్లు దొరకని పక్షంలో ఆ మేరకు విదేశీ ఉద్యోగులను తీసుకొనే అవకాశం ఈ హెచ్1బీ వీసాల వల్ల అమెరికన్ కంపెనీలకు కలుగుతుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ హెచ్1బీ వీసాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే దీనిని కొందరు ప్రజా ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు.
లక్షల మంది ఇండియన్స్ ను అమెరికా నుంచి సాగనంపేందుకు ప్రయత్నిస్తున్న ఎత్తుగడలను అక్కడి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల అమెరికాలో అసలు నైపుణ్యం లేకుండా పోతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. `హెచ్1బీ వీసాలను నియంత్రించడం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి. అమెరికాలో నైపుణ్య కొరత ఏర్పడుతుంది. అంతేకాదు ఇండియా లాంటి ప్రధాన భాగస్వామితో ఉన్న సంబంధాలు దెబ్బతింటాయి` అని డెమొక్రటిక్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబార్డ్ అన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల 5 నుంచి 7.5 లక్షల మంది ఇండియన్స్ అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్లంతా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ.. ఉద్యోగాలు కల్పిస్తూ - అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, వీళ్లు వెళ్లిపోతే ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం పడుతుందని ఆమె అన్నారు.
మరోవైపు హిందూ అమెరికన్ ఫౌండేషన్ సైతం ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్1బీ వీసాదారులకు ఆ అవకాశం కల్పించకూడదని ట్రంప్ భావిస్తున్నారని...దీంతో వాళ్లంతా అమెరికాను వీడటం తప్ప మరో మార్గం ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలుస్తున్న ఇలాంటి నైపుణ్యం కలిగిన వాళ్లను వెనక్కి పంపి ఏం సాధిస్తారని ప్రశ్నించింది. ఇక వాళ్లను తిరిగి పంపితే.. ఇక్కడి కంపెనీలు స్థానిక ఉద్యోగులకు శిక్షణ ఇవ్వకుండా తమ పెట్టుబడులను విదేశాల్లోనే పెడతాయని ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా క్రిష్ణమూర్తి అన్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరారు.
కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. `ఇది వలసదారుల వ్యతిరేక విధానం. మా తల్లిదండ్రులు హెచ్1బీ వీసాలపైనే ఇక్కడికి వచ్చారు. సత్యా నాదెళ్ల - సుందర్ పిచాయ్ - ఎలోన్ మస్క్ కూడా ఇలాగే వచ్చారు. ఇప్పుడు ట్రంప్ అలాంటి వాళ్లకు నో చెప్పడం దారుణం. మేం లేకుండా అమెరికా ఇంత గొప్పగా అయ్యేదా` అని ట్రంప్ ను ఆయన ప్రశ్నించారు. కాగా - ప్రజాప్రతినిధులే నిలదీస్తుండటంతో ట్రంప్ పార్టీకి చెందిన నేతలు సైతం ఆలోచనలో పడ్డట్లు సమాచారం.