Begin typing your search above and press return to search.

జేజమ్మ కాంగ్రెస్ గూటికి వస్తుందా?

By:  Tupaki Desk   |   27 Aug 2020 2:30 PM GMT
జేజమ్మ కాంగ్రెస్ గూటికి వస్తుందా?
X
సినిమాల్లో జేజమ్మ అనగానే.. హీరోయిన్ అనుష్క గుర్తొస్తుంది. మరి రాజకీయాల్లో జేజమ్మ ఎవరంటే..? ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది. అరుంధతి సినిమాలో చూపించిన గద్వాల్ జేజమ్మగా పిలవబడే అదే ప్రాంతానికి చెందిన బీజేపీ నేత డీకే అరుణనే అందరూ అలా పిలుస్తారు. ఈమె ఒకప్పుడు కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. రాజకీయంగా గట్టి బ్యాంక్ గ్రౌండ్ తో మంత్రిగా ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చేవారు.

వాళ్ల తండ్రి , మామ ఇద్దరూ ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక వెలుగు వెలిగారు. డీకే అరుణ కూడా కాంగ్రెస్ లో స్టేట్ లీడర్ గా ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఈమెకు మంత్రి పదవి ఇచ్చారు.

అయితే 2019 ఎన్నికల తరువాత డీకే అరుణ అనుకోకుండా బీజేపీలో చేరారు. కానీ అక్కడ పెద్దగా రాణించలేకపోతున్నారంట.. ఎందుకంటే అక్కడ ఇప్పటికే సీనియర్లు ఉన్నారంట.. పైగా బీజేపీ యువ నేతలకు అవకాశాలు ఇస్తుండడంతో జేజేమ్మ సైలెంట్ అయిపోయారు.

కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ కు భవిష్యత్ లీడర్ గా అందరూ భావిస్తున్న రేవంత్ రెడ్డి తన సామాజికవర్గానికే చెందిన డీకే అరుణను మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకొని రావాలని ప్రయత్నాలు చేస్తున్నారట.. ఆమె వస్తే గద్వాల్ డివిజన్ కాంగ్రెస్ బలపడుతుందని భావిస్తున్నాడట..

డీకే అరుణకు ఇప్పటికీ కాంగ్రెస్ లో మంచి పరిచయాలు ఉన్నాయి. కాంగ్రెస్ లోనే బలపడవచ్చు అని డీకే కుటుంబం కూడా చూస్తోంది. అదేకాకుండా కార్యకర్తలు కూడా అదే సలహా ఆమెకు ఇస్తున్నారట.. ఇప్పుడు డీకే అరుణ బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తుందని మహబూబ్ నగర్ జిల్లా అంతటా చర్చ జరుగుతోంది. మరి జేజమ్మ దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటుందో నని అభిమానులు చూస్తున్నారట. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత మేరకు సక్సెస్ అవుతాడో లేదో చూడాలి మరీ..