Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోనుందా?

By:  Tupaki Desk   |   21 Sep 2022 8:30 AM GMT
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోనుందా?
X
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బాధ్యతలు తీసుకోవటం ఖాయమైపోయిందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే స్వయంగా సోనియాగాంధీయే పిలిచి గెహ్లాట్ ను అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని సూచించినట్లు సమాచారం. పార్టీ దశాబ్దాలుగా కంటిన్యూ అవుతుంది నేతగానే కాకుండా గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా గెహ్లాట్ కు పేరుంది. ఇందుకనే సోనియానే నామినేషన్ వేయాలని సూచించారట.

అయితే గెహ్లాట్ మాత్రం చివరి నిమిషం వరకు వెయిట్ చేయాలని ఆలోచిస్తున్నారట. ఆయన ఆలోచన ఏమిటంటే రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలను వదులుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకంటే సీఎంగా తాను తప్పుకుంటే తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలెట్ సీఎం అయ్యే అవకాశాలున్నాయి. సచిన్ సీఎం కాకూడదంటు తాను పదవిని ఖాళీ చేయకూడదని గెహ్లాట్ చాలా పట్టుదలగా ఉన్నారు.

అందుకనే తప్పనిసరిగా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాల్సొస్తే రాజస్థాన్ సీఎంగా కూడా కంటిన్యూ అవుతాననే కండీషన్ పెట్టారట. ఈ కండిషన్ను సోనియా అంగీకరించలేదు. జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న నేత 24 గంటలూ ఫుల్ టైం పనిచేయాల్సుంటుంది.

అందులోను ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటు మరోవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలను చూసుకోవటం చాలా కష్టమే కాదు అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఏకకాలంలో రెండు పదవులు నిర్వహించటం సాధ్యం కాదని సోనియా స్పష్టంగా చెప్పారట.

మరీ విషయంలో గెహ్లాట్ చివరకు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు అధ్యక్ష పదవికి ఎంతమంది వీలైంత అంతమందినీ పోటీ చేయించాలని సోనియా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పోటీ చేస్తానని అంటే సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అధ్యక్ష పదవికి ఎవరు పోటీచేసినా తనకు అభ్యంతరం లేదన్నారట. అధ్యక్ష ఎన్నికల విషయంలో సోనియా, రాహుల్, ప్రియాంకలు తటస్తంగా ఉండాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాగూ గెహ్లాట్ అధికారిక అభ్యర్థి అవబోతున్నారు కాబట్టి ఎంతమంది పోటీచేసినా గెలవటం ఖాయమనే అనుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.