Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ ప‌బ్‌లో వ‌న్య‌ప్రాణులు.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   30 May 2023 9:21 PM GMT
హైద‌రాబాద్ ప‌బ్‌లో వ‌న్య‌ప్రాణులు.. ఏం జ‌రిగిందంటే!
X
హైద‌రాబాద్‌లోని ఓ ప‌బ్ ఓన‌ర్‌.. త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు వ‌న్య‌ప్రాణుల‌ను ప‌రిచ‌యం చేశాడు. అయితే.. పోలీసులు ఊరుకుంటారా.. ప‌ట్టుకుని ప‌బ్‌ను క్లోజ్ చేయించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 36లోని ఓ పబ్ చేసిన నిర్వాకం కాస్త ఆల‌స్యంగా వెలుగు చూసింది.

ఏకంగా ప‌బ్‌లో వ‌న్య‌ప్రాణుల ప్రదర్శన ఏర్పాటు చేశారు నిర్వాహకులు. పాములు, తొండలు, కుక్కలు వంటి వైల్డ్‌ జంతువులను పెట్టి కస్టమర్‌లను ఆకర్షిస్తున్నారు. వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని క్సోరా నైట్ క్లబ్ ఇటీవల తమ పబ్‌లో విదేశీ వన్యప్రాణులను చేర్చింది. ట్విట్టర్ ద్వారా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. క్సోరా నైట్‌క్లబ్ ఈ వారాంతంలో తమ పబ్‌లో అన్యదేశ వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారని తెలియ‌డంతో పోలీసులు రంగంలోకి దిగారు.

దీనిపై స్పందించిన తెలంగాణ ప్ర‌భుత్వ‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్ రీట్వీట్ చేస్తూ.. ఇది సిగ్గుచేటు సంఘటన అని వర్ణించారు. దీనిని తెలంగాణ డీజీపీ,సీపీ సీవీ ఆనంద్, తెలంగాణ పోలీస్, పీసీసీఎఫ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు జూబ్లీహిల్స్ పోలీసులు సమాచారం అందజేశారు. కాగా నెల క్రితం కూడా సైబరాబాద్‌లోనూ ఇదే రీతిలో పబ్ లో జంతువులను ప్రదర్శనకు పెట్టారు.

పాత బస్తీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నుంచి జంతువులను తీసుకొచ్చినట్టు నిర్వహకులు చెబుతున్నారు. అయితే పబ్‌లో జంతువులను ప్రదర్శించడంపై క్సోరా నైట్‌ క్లబ్‌ నిర్వాహకులు స్పందించారు. పబ్‌లో ఉపయోగిస్తున్న ఎక్సోటిక్ అనిమల్స్ లైసెన్స్‌తో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపింది. అయితే..