Begin typing your search above and press return to search.

పెద్దన్న జంటకు వైట్ హౌస్ కూడా నచ్చల

By:  Tupaki Desk   |   9 Feb 2016 12:34 PM IST
పెద్దన్న జంటకు వైట్ హౌస్ కూడా నచ్చల
X
ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్ హౌస్ అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైట్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కితే చాలు అదే గొప్పగా ఫీలయ్యే వారు కోట్లాది మంది ఉంటారు. అలాంటి వైట్ హౌస్ లోనే బస చేసే అమెరికా అధ్యక్ష దంపతులకు.. సదరు నివాసం ఎలా ఉంది? అన్న ప్రశ్న వేస్తే..?

సకల సౌకర్యాలతో పాటు.. విలాసవంతమైన గదులుంటే వైట్ హౌస్ గురించి ఒబామా ఫ్యామిలీకి కంప్లైంట్ ఉన్నాయి. ఇవాల్టి రోజున సామాన్యుడికి సైతం అందుబాటులో ఉన్న వైఫై సౌకర్యం ఈ భారీ రాజప్రసాదంలో ఉండదన్నది ఒబామా సతీమణి మిచెల్ వాపోతున్నారు. వైట్ హౌస్ లో లెక్కలేనన్ని డెడ్ స్పాట్లు ఉండటంతో వైఫై సరిగ్గా కనెక్ట్ కాదని.. దీంతో.. తమకు ఇబ్బందిగా ఉందన్న మిచెల్.. తన కూతుళ్లు కూడా ఈ కారణంగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారని చెప్పటం గమనార్హం.

వైట్ హౌస్ లాంటి రాజప్రసాదంలో వైఫై లాంటి సౌకర్యం కూడా సరిగ్గా లేకపోవటమా? అని ఆశ్చర్యంగా అనిపించక మానదు. ప్రపంచాన్ని శాసించే అమెరికా అధ్యక్షుల వారు.. తాను ఉన్న రెండు టర్మ్ లలో వైట్ హౌస్ వైఫై సౌకర్యాన్ని మరింతగా మెరుగుపర్చే విషయంలో సక్సెస్ కాకపోవటం గమనార్హం. మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్న ఒబామా.. కొత్త అధ్యక్షుడు వైట్ హౌస్ వచ్చే నాటికి వైఫై సమస్యకు చెక్ పెడతానని చెప్పటం గమనార్హం.