Begin typing your search above and press return to search.
ఏవండీ..ఆవిడనే కట్టుకోండి..ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్య!
By: Tupaki Desk | 8 Nov 2020 4:20 PM ISTయువతీ యువకులిద్దరూ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ సినీ ఫక్కీలో వారి జీవితం మలుపు తిరిగింది. సదరు యువకుడు అనుకోని పరిస్థితుల్లో మరో యువతిని పెళ్లాడవలిసి వచ్చింది. కానీ అతడు సంతోషంగా లేడు. తన ప్రేయసిని మరిచిపోలేకపోతున్నాడు. నిరతరం ఆమె ధ్యాసలోనే ఉండిపోతున్నాడు. ఆమె ఆలోచనలతో కట్టుకున్న భార్యను పట్టించుకోవడం లేదు. ఇలా మూడేండ్లు గడిచాయి. విషయం తెలుసుకున్న భార్య.. తన భర్తకు ప్రేమను అర్థం చేసుకున్నది. ప్రియురాలితోనే అతడికి పెళ్లి చేసింది. చట్టం ఇందుకు ఒప్పుకోదని తెలిసి తాను భర్తకు విడాకులు కూడా ఇచ్చింది. అచ్చం సినిమా కథలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చేసుకున్నది. విషయం తెలిసిన వారంతా ఆ భార్యమణి త్యాగాన్ని తెగ పొగుడుతున్నారు. ఈ రోజుల్లో ఇంత ఉన్నతంగా ఆలోచించే వాళ్లు కూడా ఉన్నారా? అని ఆశ్చర్యపోతున్నారు.
భోపాల్ లోని ఓ జంటకు మూడేళ్ల క్రితం పెళ్లైంది. అయితే తన భర్త గతంలో ఒక యువతిని ప్రేమించినట్టు ఆమె తెలుసుకుంది. పెళ్లైనా ఆమెను తన భర్త మర్చిపోలేకపోతున్నాడని గుర్తించింది. అయితే, ఏదో ఒక రోజు ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని... ముగ్గురం కలిసి ఆనందంగా బతుకుదామని భార్యకు ఆయన చెప్పాడు. అయితే ముగ్గరం కలిసి బతికేందుకు చట్టం ఒప్పుకోదని ఆమె తెలిపింది. దీంతో ఆమె మూడేళ్ల వైవాహిక జీవితాన్ని వదులుకోవడానికి సిద్ధమైంది. తన భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తకు ఆయన ప్రియరాలితో వివాహం జరిపించింది. ఈ విడాకుల కేసు గురించి లాయర్ మాట్లాడుతూ... ఆమె చాలా ఉన్నతంగా ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకుందని చెప్పారు. భార్య చేసిన పనిని పలువురు మెచ్చుకుంటున్నారు.