Begin typing your search above and press return to search.
దారుణమైన ప్లాన్ తో మొగుడ్ని చంపించిన వార్డు మెంబర్
By: Tupaki Desk | 1 July 2020 9:30 AM ISTబంధాలు బలహీనమవుతున్నాయి. అనుబంధాలు ఆవిరి అవుతున్నాయి. ఒకరొకొకరు తోడు నీడగా బతుకుతామంటూ బాసలు చేసుకొని వివాహ బంధంతో ఒక్కటైన వారు.. చిన్న చిన్న కోర్కెలు.. పనికి రాని వ్యామోహాలకు పోయి జీవితాల్ని నాశనం చేసుకుంటున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పక్కా ప్లాన్ చేసి భర్తను చంపేసి.. దాన్ని యాక్సిడెంట్ గా అందరిని నమ్మించిన కిలేడీ.. చివర్లో కలిగిన చిన్న అనుమానం.. పోలీసులు సైతం విస్తు పోయేలా చేసింది.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సురేష్.. బబిత భార్యభర్తలు. సైదోనిగడ్డ గ్రామ ఏడో వార్డు మెంబరు గా బబిత వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమెకు దుండిగల్ తండా కు చెందిన ప్రేమ్ సింగ్ కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అది కాస్తా స్థాయి మారింది. ప్రియుడి మోజు లో పడిన ఆమె.. తన ఆనందాలకు భర్త అడ్డు గా ఉన్నాడనే వరకూ వెళ్లింది.
ఎలా అయినా భర్తను వదిలించుకోవాలన్న ఉద్దేశం తో ప్రియుడు ప్రేమ్ సింగ్ తో కలిసి దారుణమైన ప్లాన్ వేసింది. బబిత భర్త భారత్ బయోటెక్ లో పని చేస్తుంటాడు. ఎప్పటిలానే తన భర్త వేసిన స్కెచ్ తెలీని అతగాడు ఆఫీసు నుంచి వస్తుండగా.. ముందు గా వేసుకున్న ప్లాన్ తో డీసీఎం తో ఢీ కొట్టారు. ప్రమాదమని అందరూ భావించేలా చేసి.. కారు లో తరలించే ప్రయత్నం లో గొంతు నొక్కి చంపేశారు.
అయితే.. ఈ ఉదంతంపై మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు అనుమానపు తీగను లాగటం షురూచేశారు. చివరకు డొంక కదిలి.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఈ హత్య కేసులో బబిత.. ప్రియుడు ప్రేమ్ సింగ్ తో పాటు.. మరో ముగ్గురిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.మరో నలుగురు ఆనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.చక్కటైన కుటుంబం.. చుట్టుపక్కల మంచి పేరున్నప్పటికి.. వ్యామోహంతో విచక్షణ మరిని బబిత ఇప్పుడు జైలుఊచలు లెక్కిస్తోంది.