Begin typing your search above and press return to search.

భర్తకు సర్ ప్రైజ్ చేద్దామనుకున్న భార్య చిక్కుల్లో పడిందే

By:  Tupaki Desk   |   30 Jan 2020 10:02 AM IST
భర్తకు సర్ ప్రైజ్ చేద్దామనుకున్న భార్య చిక్కుల్లో పడిందే
X
మనం అనుకున్నట్లే అన్ని జరగవు. కొన్నిసార్లు మన ఆలోచనలకు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. తాజా ఉదంతం అలాంటిదే. తన భర్తను సర్ ప్రైజ్ చేసేందుకు ఒక భార్యామణి వినూత్నం గా ఆలోచించింది. తనకు సంబంధించిన కొన్ని బోల్డ్ ఫోటోల్ని ప్రత్యేకంగా ఫోటో షూట్ పెట్టుకొని మరీ ఆల్బమ్ తయారుచేసింది. ఇదంతా నీ కోసమే అంటూ సదరు అల్బమ్ ను అతడికి గిఫ్ట్ ఇచ్చింది.

సదరు ఆల్బమ్.. అందులో తన భార్యకు సంబంధించిన ఫోటోల్ని చూసిన సదరు భర్త సంతోషించినా.. ఆ తర్వాత అతగాడికి వచ్చిన సందేహాలకు సమాధానాలు చెప్పటం ఆ భార్యమణి కి పెద్ద తల నొప్పిగా మారింది. ఇదంతా మన దేశంలో జరగలేదు. అమెరికా లాంటి దేశంలో జరిగింది. దేశం ఏదైనా.. కల్చర్ మరేదైనా.. భర్త భర్తే అన్నట్లుగా అతగాడి తీరు ఉంది.

ఇంతకీ నీ ఫోటోల్ని తీసింది మహిళా ఫోటోగ్రాఫరా? పురుష ఫోటోగ్రాఫరా? అన్న ప్రశ్నకు భార్య సమాధానం చెప్పలేదట. దీంతో.. అతగాడిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఒక పురుష ఫోటో గ్రాఫర్ ముందు ఇలా బోల్డ్ ఫోటోలకు ఫోజులు ఎలా ఇచ్చావు? ఇలాంటివి చేసే ముందు నన్ను అడగాల్సిన అవసరం లేదా? ఇలా ఎవరోపరాయి వ్యక్తి ముందు నిలుచొని ఫోటోలు దిగుతావా? లాంటి యక్ష ప్రశ్నలు వేయటమే కాదు.. కోపంతో ఇంట్లో నుంచి వెళ్లి పోయాడట. ఈ విషయాల్ని సదరు భర్తే స్వయంగా ఒక పోర్టల్ లో రాసుకొచ్చాడు. అతగాడి సుంకుచిత మనస్త్తత్వాన్ని పలువురు తప్పు పడుతుంటే.. భర్త మనసుకు తగ్గట్లు భార్య ఆలోచించి ఉంటే ఇలాంటి అనవసరమైన చిక్కులు ఉండేవి కాదన్న సలహాలు వినిపిస్తున్నాయి.