Begin typing your search above and press return to search.

మొబైల్‌ చార్జర్‌ తో భర్త ను చంపిన భార్య !

By:  Tupaki Desk   |   17 Sept 2020 11:30 AM IST
మొబైల్‌ చార్జర్‌ తో భర్త ను చంపిన భార్య !
X
ఈ సమాజంలో రోజురోజుకి దారుణ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నిరోజుల క్రితం వరకు మగవారు , ఆడవారిపై దారుణాలకు దిగేవారు. కానీ , రోజులు మారాయి అని చాటిచెప్తూ .. మహిళలే ఈ మధ్య తమ భర్తలని చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్ లో న్యాయవాది తన భర్తని మొబైల్ ఛార్జర్ కేబుల్ ను మెడకి చుట్టి చంపేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచటన తీర్పు వెలువరించింది. భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిన భార్యకు జీవిత ఖైదు విధించింది. కోల్ ‌కత్తాకు చెందిన ఓ మహిళా న్యాయవాదికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు.

తన భర్త రజత్ డేని మొబైల్ ఫోన్ ఛార్జర్‌తో గొంతు కోసి చంపిన కేసులో లాయర్ అనిండితా పాల్కు పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగనాస్ జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. తన భర్త హత్య కేసులో సోమవారం ఆమెను దోషిగా తేల్చిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సుజిత్ కుమార్ ఆమెకు జీవిత ఖైదు తోపాటు రూ.10,000 జరిమానా విధించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యం అదృశ్యం కావడానికి కారణంగా భావించిన కోర్టు ఆమెను దోషిగా తేలింది. ఇందు కోసం ఆమెకు అదనంగా మరో సంవత్సరం జైలు శిక్ష విధించింది. రెండు తీర్పులు ఏకకాలంలో విధించాలని న్యాయమూర్తి ఆదేశించారు.