Begin typing your search above and press return to search.

50 మంది బాయ్ ఫ్రెండ్స్.. చివరకు భర్తనే చంపేసింది

By:  Tupaki Desk   |   10 Aug 2021 6:54 AM GMT
50 మంది బాయ్ ఫ్రెండ్స్.. చివరకు భర్తనే చంపేసింది
X
పెళ్లి చేసుకునే సమయంలో తల్లిదండ్రులు చెప్పిన మాటలకు తలూపడం.. ఆ తరువాత చేసుకున్న భర్తతో వ్యతిరేకంగా ఉండడం.. చివరికి పాత భాయ్ ప్రెండ్ తో కలిసి సరసాలు సాగించడంతో చాలా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భాయ్ ఫ్రెండ్ తో తమ పనులకు అడ్డంగా ఉండడంతో చివరికి కట్టుకున్న భర్తను లోకంలో లేకుండా చేయడం.. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజూ ఎక్కోడో చోట జరుగుతున్నాయి. ఇలాంటి వాటిపై పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. భార్య భర్తల సంబంధాల గురించి ఎంత చెప్పినా కొందరు వారి పనులు చేయడం మానడం లేదు. కానీ ఓ భార్య తన భర్తను కాదని ఏకంగా 50 మందితో వ్యవహారం నడిపింది. వీరిలో కొందరితో శారీరకంగా కూడా కలిసిపోయింది. కానీ ఈ వ్యవహారానికి అడ్డుగా ఉన్న భర్తను ఏం చేసిందో తెలుసా..?

తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన షాలిని అనే అమ్మాయికి కొన్ని సంవత్సరాల కిందట పెళ్లయింది. ఆమె వయసు 22 ఏళ్లు. కానీ తనకంటే 17 ఏళ్లు పెద్ద వయసు ఉన్న వారితో వివాహాన్ని జరిపించారు కుటుంబ సభ్యులు. పెళ్లి చేసుకునే సమయంలో పెద్దల మాట జవదాటని షాలిని పెళ్లయిన తరువాత మాత్రం భర్తకు దూరంగా ఉంటూ వచ్చేది. అయితే భర్త ప్రభు మాత్రం షాలినిని ప్రేమగా చూసుకునేవాడు. షాలిని అడిగిన ప్రతి ఒక్కటి తెచ్చేవాడు. కానీ షాలిని మాత్రం భర్త ప్రేమను పొందలేకపోయింది. అంతకుముందు ఉన్న భాయ్ ప్రెండ్ తోనే సంబంధాలు కొనసాగించేది.

ఇక షాలినికి ఫేస్బుక్ లో అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ద్వారా ఏకంగా 50 మందితో ఒకరికి తెలియకుండా మరొకరితో చాటింగ్ చేసేది. రోజూ వారితో టచ్ లో ఉండేసరికి కొందరు ప్రేమలో మునిగిపోయారు. ఇంకొందరు ఒకడుగు ముందుకేసీ షాలినితో శారీరక సంబంధాలు కొనసాగించారు. అయితే ఇదంతా షాలిని భర్తకు తెలియకుండా జరిగేది. ఓ రోజు సెల్వరాజ్ అనే వ్యక్తితో తన ఇంట్లో ఉన్న సమయంలో భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో భర్త షాలినిని గట్టిగా మందలించాడు. మరోసారి ఇలా చేస్తే బాగుండదని హెచ్చరించాడు. అయినా షాలిని భర్త మాట వినకుండా అక్రమ సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది.

అయితే తన వ్యవహారాలకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో తనను లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. తన భాయ్ ఫ్రెండ్స్ లో ఒకరైన సెల్వరాజ్ తో కలిసి భర్తను హత్యకు పథకం పన్నింది. సెల్వరాజ్ సాయంతో ఇంట్లోనే భర్తను హత్య చేసింది. అయితే హత్య తరువాత షాలినినే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తాను ఇంట్లో లేని సమయంలో తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని తెలిపింది. దీంతో పోలీసులు లోతుగా పరిశీలించారు. ఆ తరువాత దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో షాలినిని కూడా తమదైన శైలిలో విచారించారు. అన్నికోణాల్లో దర్యాప్తు చేసి కేసును కొలిక్కి తెచ్చారు. చివరికి షాలిని భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈక్రమంలో షాలిని సోషల్ మీడియాలో చాలా అకౌట్లు ఉన్నాయని వాటి ద్వారా 50 మంది ఫ్రెండ్స్ ఉన్నట్లు తెలిపింది. దీంతో వారి గురించి ఎంక్వైరీ చేసేలోపే వారు ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. అయితే వారి నెంబర్లను కూడా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. షాలినిని మాత్రం పోలీసులు జైల్లో పెట్టారు. కట్టుకున్న భర్త ఇష్టం లేదని షాలిని ముందే చెబితే అతని ప్రాణాలు దక్కేవి. ఇలా బలవంతంపు పెళ్లి చేయడం వల్ల అమాయకులు బలవుతున్నారని పోలీసులు వాపోతున్నారు.