Begin typing your search above and press return to search.
పోలీసుల ముందే భర్తను చితక్కొట్టింది
By: Tupaki Desk | 6 Sept 2020 12:30 PM ISTఅక్రమ సంబంధాలు ఇటీవల బాగా పెరిగిపోతున్నాయి. అత్యధిక సంబంధాలకు కారణం మొబైల్ ఫోనే. ఆ చర్చ తర్వాత గాని... భార్యను, పిల్లలను గాలికి వదిలేసి మరో వితంతువుతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను ఓ భార్య చితక్కొట్టింది. పోలీసుల ముందే ఈ ఘటన జరగడంతో అక్కడున్నవారంతా షాక్ తిన్నారు.
నల్గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురానికి చెందిన మాధవి చిట్యాల మండలం ఎలికట్టకు చెందిన సాయిబాబాను 2011లో వివాహం చేసుకుంది. సాయిబాబా కారు డ్రైవర్. ఇటీవల అతనికి భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా శారీరక సంబంధం వరకు వెళ్లింది. దీంోత మూడు నెలలుగా భార్య, పిల్లలను పట్టించుకోవడం అతను పట్టించుకోవడం మానేశాడు. అసలు ఇంటికి రావడమే మానేసి ఒంటరి మహిళతో ఎంచక్కా కాపురం మొదలుపెట్టాడు.
చాలా కాలం ఓపిక పట్టి అతను ఎంతకీ పట్టించుకోకపోయే సరికి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిని వెంటబెట్టుకుని భర్త ఉంటున్న వితంతువు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో సాయిబాబా అక్కడే ఉన్నారు. మాధవితో పాటు ఆమె బంధువులు కూడా ఉన్నారు. వారందరి ముందే సాయిబాబాను కసితీరా చితకబాదిన మాధవి అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించింది.
అక్రమ సంబంధమే తప్పురా అంటే మరీ ఇంత బరితెగించి అసలు భార్యను, పిల్లలను వదిలేసి కొత్తకాపురం పెడితే మరి ఊరుకుంటారా? !!