Begin typing your search above and press return to search.

అనుకోని పరిస్థితుల్లో సర్పంచ్ గా భార్య పోటీ .. స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   17 Feb 2021 5:04 PM IST
అనుకోని పరిస్థితుల్లో సర్పంచ్ గా భార్య పోటీ .. స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు
X
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు మూడో దశ పోలింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ లో భాగంగా స్పీకర్ తమ్మినేని తన స్వగ్రామమైన తొగరాంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తొగరాంలో ఓటువేయడం సంతోషంగా ఉందన్న తమ్మినేని, పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు పూర్తి అయిన మొదటి , రెండవ విడతల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని. ఇది ప్రో గవర్నమెంట్ తీర్పని అన్నార.

పార్టీ గుర్తు లేకపోయినా కూడా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారని, రేపు పార్టీ సింబల్ పై ఎన్నికలు జరిగితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని అందులో ఎలాంటి సందేహం లేదంటూ జోస్యం చెప్పారు. సర్పంచ్ గా పోటీచేయడం పెద్దగా ఆసక్తి లేనప్పటికీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో భార్య వాణిని తొగరాం సర్పంచ్ అభ్యర్ధిగా నిలబెట్టాల్సి వచ్చిందని అన్నారు. అయితే , స్పీకర్ కు తొగరాంలో పనేంటని కొందరు విమర్శలు చేస్తున్నారని తొగరాం నా స్వగ్రామం నాఓటు ఇక్కడే ఉందని ఆయన అన్నారు.

తొగరాంలో కాకుండా బొడ్డేపల్లిపేటలో తనకు ఓటుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఆయనతీవ్రంగా తప్పుబట్టారు. దశాబ్ధాలుగా తాను తీసారీ ఓటు తొగరాంలోనే వేస్తున్నానని గుర్తుచేశారు . తన భార్య సర్పంచ్ గా బరిలో నిలిచినప్పటికీ తాను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయలేదని అన్నారు. కొంతమందిలాగా వెధవ పనులు అస్సలు చేయలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.