Begin typing your search above and press return to search.

బ్యూటీపార్లర్ పేరుతో హోటల్ లో కానిస్టేబుల్‌ తో భార్య కామక్రీడలు..భర్త ఏంచేసాడంటే?

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:30 PM GMT
బ్యూటీపార్లర్ పేరుతో హోటల్ లో కానిస్టేబుల్‌ తో భార్య కామక్రీడలు..భర్త ఏంచేసాడంటే?
X
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని హోటల్‌ గదిలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం వెలుగులోకి వచ్చింది. వివాహం అయిన మరో మహిళతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ వంశీ హోటల్ గదిలో ఉండగా.. సదురు మహిళ భర్త పోలీసులతో వెళ్లి రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ వ్యవహారం బయటపడింది. ఇందులో భాగంగానే సోమవారం కూడా బ్యూటీపార్లర్ వెళ్తున్నా అంటూ ఇంటి నుంచి వెళ్లిన సదరు మహిళ కానిస్టేబుల్‌ తో కలిసి హోటల్ గదికి వెళ్లింది.

ఈ విషయాన్ని గమనించిన సదరు మహిళ భర్త పోలీసులకి ఈ వ్యవహారం గురించి చెప్పి ,వారిని వెంటబెట్టుకొని తీసుకుని నేరుగా హోటల్ గదికి వెళ్లాడు. భర్త తలుపు తట్టగా అతని గొంత గుర్తు పట్టిన మహిళ బాత్రూంలోకి వెళ్లి దాక్కుంది. దీంతో పోలీసులు బలవంతంగా తలుపు తీసి చూడగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన భార్య బ్యూటిషిషన్‌గా చేస్తున్నాని చెప్పి ఇంటి నుంచి వెళ్లి ఏఆర్‌ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త వాపోయాడు.

తన భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఏఆర్ కానిస్టేబుల్ వంశీ లొంగదీసుకుని వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణలు చేసాడు. భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. దీంతో ఏర్‌ కానిస్టేబుల్ ‌ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌ కు తరలించారు.