Begin typing your search above and press return to search.

బెడ్రూంలో భర్తతో సరసం.. భార్య అరెస్టు..

By:  Tupaki Desk   |   1 Aug 2020 10:00 AM IST
బెడ్రూంలో భర్తతో సరసం.. భార్య అరెస్టు..
X
వినేందుకు విచిత్రంగా ఉండే సిత్రమైన విషయాలు కొన్ని విదేశాల్లో తరచూ చోటు చేసుకుంటుంటాయి. ఆ కోవకే చెందింది ఇప్పుడు చెప్పే ఉదంతం. భార్య.. భర్తలు అన్నాక బెడ్రూంలో సవాలచ్చ యవ్వారాలు ఉంటాయి. కానీ.. వాటిల్లోనూ పరిమితులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోయిందో భార్యామణి. భర్తకు మూడ్ వస్తే..నిద్రపోయే భార్యను లేపి మరీ తన కోరిక తీర్చుకోవటం చాలా కామన్.

తాజా ఉదంతంలో సీన్ రివర్స్ అయ్యింది.సదరు భార్యామణి చేసిన పని.. ఆమెను చిక్కుల్లో పడేసేలా చేసింది. ఇంతకీ ఈ వ్యవహారం ఎక్కడ జరిగిందన్న విషయంలోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. తంపాలో నివసించే 44 ఏళ్ల మధ్యవయస్కురాలైన యువతి ఫ్లోరా (పేరు మార్చాం) తన భర్తతో రొమాన్సు చేసింది. అనంతరం ఆమెకు మాంచి మూడ్ వచ్చింది. భర్తతో సెక్సు చేయాలన్నదే ఆమె ఉద్దేశం అయితే.. సున్నితంగా ముగ్గులోకి దించాలి. లేదంటే.. మగాడ్ని నిద్ర లేపాలి.

అందుకు భిన్నంగా భర్త అంగాన్ని.. వృషణాలను చేతులతో గట్టిగా పిండేసింది. ఈ దెబ్బకు నిద్ర ఎగిరిపోవటమే కాదు.. గావు కేక పెట్టినంత పని చేశాడు. అసలేం జరిగిందో అర్థమయ్యే లోపు ప్రాణం పోయినంత నొప్పితో విలవిలలాడాడు. అంతేనా.. కనీసం నిలుచొని నాలుగు అడుగులు వేయలేని దుస్థితి. దీంతో.. కోపం తన్నుకొచ్చిన అతగాడు.. భార్య ఫ్లోరాపై విరుచుకుపడ్డాడు. ఇద్దరి మధ్య మాటా మాటా అనుకోవటమే కాదు.. తనపై జరిగిన శారీరక హింస గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అంతే.. వారు రంగంలోకి దిగి.. విషయాన్ని పరిశీలించి.. ఫ్లోరాను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు. అనుకుంటాం కానీ.. మోటుగా కాకుండా కాస్త సున్నితంగా బిహేవ్ చేసి ఉంటే.. సీన్ మరోలా ఉండేది. అందుకు భిన్నంగా ఇప్పుడు నొప్పితో విలవిలలాడుతూ భర్త ఆసుపత్రికి వెళితే.. చేసిన ఎదవ పనికి జైల్లో ఊచలు లెక్కేసే పరిస్థితి సదరు భార్యామణికి చోటు చేసుకుంది.

తాను తప్పు చేయలేదని.. భర్తతో సెక్సు చేయాలన్న ఉద్దేశంతో కాస్త గట్టిగా పట్టుకున్నానే తప్పించి.. మరేం చేయలేదని చెప్పిందట. అమ్మడి బలం దెబ్బకు సదరు భర్త విలవిలలాడిపోతున్నారట. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట. మరీ జంట భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.