Begin typing your search above and press return to search.

భర్త బైక్ డ్రైవ్ చేస్తే .. భార్య ఫోన్లు లాగేస్తోంది !

By:  Tupaki Desk   |   11 May 2020 8:30 PM IST
భర్త బైక్ డ్రైవ్ చేస్తే .. భార్య ఫోన్లు లాగేస్తోంది !
X
భార్యను భర్తలో సగ భాగం అని అంటారు. భార్యభర్తల బంధం, వారి మద్య అన్యోన్యత గురించి ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా వర్ణించారు. కానీ, ఇప్పట్లో అలాంటి జంటలు అసలు కనిపించడం లేదు. కానీ ,ఢిల్లీకి చెందిన ఈ దంపతులిద్దరూ అలాంటివాళ్లే. అయితే, కొంచెం తేడా టైప్ అన్నమాట. డ్రైవింగ్ సీటులో భర్త బండి నడుపుతుంటూ.. వెనకాలే కూర్చునే భార్య జనం చేతిలో నుంచి సెల్ ఫోన్లు లాగేస్తుంది.

గత కొద్దిరోజులుగా భార్యాభర్తలిద్దరూ ఈ వృత్తిలో తార స్థాయికి చేరుకున్నారు. అయితే, ఢిల్లీ సెంట్రల్ జిల్లా పరిధిలో కొంతకాలంగా స్నాచింగ్ లకు పాల్పడుతోన్న ఈ కంత్రీజంటను పోలీసులు తాజాగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..సెంట్రల్ ఢిల్లీలోని పహార్ ‌జంగ్‌ కు చెందిన అర్జున్ అలియాస్ కరణ్ పక్కా క్రిమినల్ టైప్. చదువు మధ్యలోనే ఆపేసి బలాదూర్ గా తిరుగుతూ, డ్రగ్స్ దందా చేసేవాడు. ఇతనిపై ఇదివరకే 31 కేసలున్నాయి. అదే ప్రాంతానికి చెందిన టాటూ ఆర్టిస్ట్ వైశాలి అలియాస్ సీమా.. అర్జున్ దగ్గర్నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేది. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారి, నాలుగు నెలల కిందటే పెళ్లిచేసుకున్నారు.

అయితే, ఈ లాక్ డౌన్ కారణంగా వైశాలీ పని కోల్పోయింది, కస్టమర్లు లేక అర్జున్ దందా కూడా తగ్గిపోయింది. డబ్బులకు బాగా ఇబ్బంది ఏర్పడటంతో ఈ జంట స్నాచింగ్స్ పై దృష్టిపెట్టారు. ముందుగా రఘుబీర్ నగర్ ఏరియాలో ఓ స్కూటీని కొట్టేశారు. భర్త బండి నడిపితే, వెనకాలే కూర్చున్న భర్య.. సెల్ ఫోన్లను లాగేసుకుని ఉడాయించేవారు. సెంట్రల్ ఢిల్లీలో పలువురు బాధితులు ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనితో స్నాచింగ్స్ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఫోన్లను లాగేసుకుంది మహిళేనని నిర్ధారణకు వచ్చారు. అయితే ఫుటేజీ క్లియర్ గా లేక పోవడంతో వాళ్ల ముఖాలను గుర్తుపట్టలేకపోయారు.

అర్జున్-వైశాలీ దొంగతనాల కోసం ఒకే బైక్ ను వాడుతున్నట్లు కనిపెట్టిన పోలీసులు.. ఆ బండి కదలికలపై నిఘా పెట్టారు. రెండ్రోజుల కిందట కిషన్ గంజ్ రైల్వే కాలనీలో స్నాచింగ్ చేసి పారిపోతున్న జంటను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇద్దరిపైనా కేసులు నమోదు నమోదచేసి కటకటాల్లోకి పంపారు. అర్జున్-వైశాలి ఇద్దరూ డ్రగ్స్ కు బానిసలయ్యారని, పనులు కోల్పోయి, డ్రగ్స్ కొనడానికి డబ్బులు లేకే స్నాచింగ్ లు మొదలు పెట్టారని, దొంగిలించిన సెల్ ఫోన్లను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేందుకు ప్రయత్నించారని పోలీసులు చెప్పారు