Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఎవ‌ర్ని.. ఎందుకు క‌ల‌వ‌న‌ట్లు?

By:  Tupaki Desk   |   11 May 2019 3:27 PM IST
జ‌గ‌న్ ఎవ‌ర్ని.. ఎందుకు క‌ల‌వ‌న‌ట్లు?
X
ఏపీలో పోలింగ్ ముగిసి దాదాపు నెల కావొస్తోంది. పోలింగ్ త‌ర్వాత కూడా త‌న‌కు అల‌వాటైన రీతిలో ఏపీ ముఖ్య‌మంత్రి అదే ప‌నిగా స‌మీక్ష‌లు.. స‌మావేశాలు.. టూర్లు.. మిత్రుల ప్ర‌చారాల‌కు హాజ‌ర‌వుతూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బ‌య‌ట‌కు పెద్ద‌గా రాని ఆయ‌న‌.. చాలా త‌క్కువ సంద‌ర్భాల్లోనే బ‌య‌ట క‌నిపించారు. పూర్తిగా లో ప్రొఫైల్ మొయింటైన్ చేస్తున్న ఆయ‌న‌.. స‌న్నిహితులు ఒక‌రిద్ద‌రు త‌ప్పించి పార్టీ నేత‌ల‌కు అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వ‌ట్లేదంటున్నారు. ఎందుకిలా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఎన్నిక‌ల మొద‌లు పోలింగ్ పూర్తి అయిన త‌ర్వాత జ‌గ‌న్ కు ప‌వ‌ర్ ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. ఆయ‌న ఎందుకు ఎవ‌రిని క‌ల‌వ‌ట్లేద‌న్న‌ది సందేహంగా మారింది. ప్ర‌మాణ‌స్వీకారం మీద ప్ర‌శ్నించిన వారికి.. ప్ర‌మాణ‌స్వీకారం తేదీని ఆ దేవుడే డిసైడ్ చేస్తాడ‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. కామ్ గా ఉంటున్నారు.

పార్టీ నేత బొత్స కుటుంబ స‌భ్యుల వివాహానికి హాజ‌రైన జ‌గ‌న్‌.. త‌ర్వాత హైద‌రాబాద్ లో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ కు చూసిన‌ట్లుగా మీడియాలో రిపోర్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆయ‌న ఫారిన్ టూర్ వెళుతున్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. మ‌ళ్లీ.. ఆయ‌న టూర్ కేన్సిల్ అయిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఎలాంటి ప్ర‌క‌ట‌న జ‌గ‌న్ నుంచి రాలేదు. అదే స‌మ‌యంలో పార్టీకి చెందిన నేత‌ల్ని ఆయ‌న క‌ల‌వ‌ట్లేదు.

ఎందుకిలా అంటే.. పార్టీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న నేత‌ల కొంద‌రి వాద‌న ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇప్పుడేమీ చేయ‌లేని ప‌రిస్థితి. చంద్ర‌బాబు మాదిరి హ‌డావుడి చేయ‌టం.. లేనిపోని మాట‌లు మాట్లాడ‌టం..లాంటివి జ‌గ‌న్ కు ఇష్టం ఉండ‌ద‌ని.. అందుకే ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కూ వ్యూహాత్మ‌క నిశ్శ‌బ్దాన్ని మొయింటైన్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే పార్టీ నేత‌లు మొద‌లు ఎవ‌రితోనూ క‌ల‌వ‌కుండా ఉండిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఫ‌లితాల త‌ర్వాత జ‌గ‌న్ పూర్తిస్థాయి ప‌ని తీరు క‌నిపిస్తుంద‌ని చెబుతున్న వారు.. లోలోన గ్రౌండ్ వ‌ర్క్ భారీ ఎత్తున సాగుతుందంటున్నారు. ఇదంతా ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌న్న విష‌యం ఫ‌లితాలు వెల్ల‌డైతే త‌ప్పించి.. వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చేలా క‌నిపించ‌ట్లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.