Begin typing your search above and press return to search.

జానీ బెయిర్ స్టోకు వాషింగ్టన్​ సుందర్​కు గొడవేంటి?

By:  Tupaki Desk   |   14 March 2021 12:03 PM GMT
జానీ బెయిర్ స్టోకు వాషింగ్టన్​ సుందర్​కు గొడవేంటి?
X
టీ20 సీరిస్​ మొదటి మ్యాచ్ లో ఇంగ్లాండ్​ బ్యాట్స్మెన్​ జానీ బెయిర్​ స్టోకు .. యువ ఆల్​రౌండర్​ వాషింగ్టన్ సుందర్​కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.

ఇంగ్లండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్ స్టోపై టీమిండియా యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20‌లో భారత్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా సుందర్, బెయిర్ స్టోల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు అంపైర్, టీమిండియా వికెట్ కీపర్ రిషబ్​ పంత్ జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

టీ20 మ్యాచ్​లో ఇంగ్లండ్​ ఇన్సింగ్స్​ నడుస్తున్నది. 13 వ ఓవర్​లో ఆఖరిబంతిని డేవిడ్​ మలన్​ ఎదుర్కొన్నాడు. అతడు స్ట్రెయిట్​ షాట్​ అడాడు. అనంతరం పరుగు తీసేందుకు ముందుకెళ్లాడు. అయితే ఈ బంతిని క్యాచ్​ పట్టేందుకు వాషింగ్టన్ సుందర్​ ముందుకొచ్చాడు. ఈ క్రమంలో ఒకరికొకరు ఢీ కొట్టుకోవడంతో వాషింగ్టన్​సుందర్​కు క్యాచ్​ పట్టే అవకాశం మిస్​ అయ్యింది. దీంతో అతడు డేవిడ్​ మలన్​పై సీరియస్​ అయ్యాడు. ఓ దశలో ఇద్దరు తిట్టుకోవడంతో రచ్చ రచ్చగా మారింది. చివరకు ఫీల్డ్​ అంపైర్​ నితిన్ మీనన్ జోక్యం చేసుకొని ఇద్దరికీ నచ్చ జెప్పాడు.

వాషింగ్టన్​ సుందర్​ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు.. బెయిర్‌ స్టో‌పై గట్టిగా అరిచాడు. అయితే వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ జోక్యం చేసుకొని వాషింగ్టన్​ సుందర్​ను వారించాడు. దీంతో వివాదం ముగిసింది. అయితే ఆ తర్వాత ఓవర్​లో సుందర్.. బెయిర్​ స్టో కావాలని అలా చేయలేదని తెలుసుకొని అతడికి క్షమాపణలు చెప్పాడు.

అతడు సుందర్ భుజంపై చేయి వేస్తూ పర్లేదంటూ.. ఆటలో ఇదంతా కామన్ అంటూ వెన్ను తట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో రచ్చరచ్చగా మారింది. ఇవాళ సాయంత్రం రెండో టీ20 జరగనున్నది. మొదటి టీ20 లో ఓడిపోయిన టీమిండియా .. ఇవాళ ఎలాగైనా గెలవాలని చూస్తున్నది.