Begin typing your search above and press return to search.

తిరుమలకు రావొద్దు ప్లీజ్

By:  Tupaki Desk   |   12 July 2019 6:19 AM GMT
తిరుమలకు రావొద్దు ప్లీజ్
X
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈనెల 16వ తేదీన తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచించారు. ఆరోజు చంద్రగ్రహణం కాబట్టి స్వామి వారి ఆలయాన్ని రాత్రి ఏడు గంటలకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కారణంగా భక్తులను ముందురోజు అర్ధరాత్రి తర్వాత నుంచే క్యూలైన్లలోకి అనుమతించరని, ఈ విషయాన్ని గమనించి భక్తులు కొండపైకి రాకుండా ఉండడమే మంచిదని సూచించారు.

పది హేడవ తేదీ ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారన్నారు. ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అందువల్ల దాదాపు పన్నెండు గంటలపాటు స్వామి వారి దర్శనం ఉండదని తెలిపారు. క్యూ లైన్లలోకి కూడా భక్తులను అనుమతించనందున కొండపైకి వచ్చే వారు ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఈ కారణంగా ఆ సమయంలో భక్తులు రాకుండా ఉండడమే మంచిదని సూచించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

కాగా ఇటీవల కాలమంతా తిరుమల విపరీతమైన రద్దీని చూసింది. వేసవి సెలవులు.. ఎన్నికల తరువాత నాయకుల పర్యటనలు.. వర్షాలు లేకుండా వాతావరణం అనుకూలంగా ఉండడంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఇటీవల అంతా తిరుమల రద్దీగా ఉంది. అయితే.. ఇప్పుడు16న గ్రహణం కారణంగా ముందు రోజు నుంచే క్యూలైన్లలోకి భక్తులను అనుమతించరు కాబట్టి రద్దీ ఏర్పడకుండా తితిదే భక్తులకు ఈ సూచనలు చేసింది.