Begin typing your search above and press return to search.
ఈ రాజకీయాలు నీకెందుకు? అన్నారు .. కానీ, సర్పంచ్ గా గెలిచి సత్తా చాటింది !
By: Tupaki Desk | 16 Feb 2021 4:04 PM ISTఅసలు రాజకీయాలు నీకెందుకు .. మహా అయితే ఈ ఊరిలో ఇంకో ఐదేళ్లు ఉంటావేమో ఆ తర్వాత పెళ్లి చేసుకొని మీ అత్తారింటికి వెళ్ళిపోతావు అంటూ ఓ యువతిని తన కుటుంబ సభ్యులు నిరాశ పరచినా కూడా మొక్కువోని దైర్యంతో అడుగు ముందుకు వేసి గ్రామ సర్పంచి గా ఎన్నికైంది. ఆ యువతి ఎవరో కాదు.. 21 ఏళ్ల స్నేహల్ కల్భోర్. మహారాష్ట్రలోని పుణె జిల్లా ఖాడ్కి గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మహారాష్ట్రలో 14 వేల 234 గ్రామ పంచాయతీలకు తాజాగా ఎన్నికలు జరిగాయి.
ఈ ఎన్నికల్లో యువత పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. చాలా చోట్ల యువ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో స్నేహల్ కల్భోర్ ఒకరు.
తన చదువును గ్రామ అభివృద్ధికి, మహిళల సాధికారత కోసం ఉపయోగిస్తానని ఆమె చెప్పారు. స్నేహల్ ప్రస్తుతం ఎంసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. నా ప్రత్యర్థి మహిళా అభ్యర్థులు వయసులో నా కంటే పెద్దవారు. కానీ, వారు చదువుకోలేదు. గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను, మహిళల కోసం, యువతకు మెరుగైన విద్య కోసం నేను ఏం చేయగలను అనేది ప్రచారంలో వివరించి, మా గ్రామ ప్రజలను ఒప్పించాను అని స్నేహల్ చెప్పారు.
రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని చెప్పదలచుకున్నాను. మహిళలు తమంతట తాముగా రాజకీయాలు నేర్చుకోవచ్చు. మన గ్రామ పంచాయతీ, రాష్ట్రం, దేశం ఎలా పనిచేస్తుందో వారు తెలుసుకోవచ్చు. మా ఊరిలోని మహిళలందరూ గ్రామ పంచాయతీకి రావాలని కోరాను. ఇక్కడ మేం ఎలా పనిచేస్తున్నామో మీరే పరిశీలించండి అని చెప్పాను. నా విధుల్లో మా కుటుంబ సభ్యులను జోక్యం చేసుకోనివ్వను అని తెలిపారు. మహిళలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక శిబిరాలు, సదస్సులు నిర్వహిస్తాం. స్కిల్ ఇండియా ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. చుట్టుపక్కల ప్రాంతాల మహిళలను కూడా మా గ్రామానికి ఆహ్వానించి యువతకు, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేయమని వారిని అభ్యర్థిస్తాం అన్నారు.
ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే లేదా ఎంపి స్థానానికి పోటీ చేయాలనుకుంటున్నారా అని అడిగితే .. నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాను. అయితే, ప్రస్తుతానికి సర్పంచ్ అవ్వడం నాకు పెద్ద బాధ్యత అని స్నేహల్ అన్నారు.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మీ స్నేహితులు ఏమన్నారు, అని అడిగితే.. నీకు ఇది చక్కని అవకాశం అని నా స్నేహితులు చెప్పారు. మాకు ఈ అవకాశం రాలేదు. మా గ్రామంలో మాకు మద్దతు లేదు, మా ఇంట్లో వాళ్లు రాజకీయాలను ప్రోత్సహించరు. నీకు అవకాశం వచ్చింది, ధైర్యంగా ముందుకెళ్లు అని సూచించారు. ఇప్పుడు నన్ను చూసి వారంతా సంతోషిస్తున్నారు. అమ్మాయిలు రాజకీయాల్లోకి వెళ్ళవచ్చని నేను వారి కుటుంబాలను కూడా ప్రేరేపించాను అని ఆమె వివరించారు.