Begin typing your search above and press return to search.

కోట్ల ఖర్చు దండగ.. తంబీల రూపాయి ఫార్ములాను ఫాలో అయిపోతే సరి

By:  Tupaki Desk   |   11 Nov 2019 11:37 AM IST
కోట్ల ఖర్చు దండగ.. తంబీల రూపాయి ఫార్ములాను ఫాలో అయిపోతే సరి
X
ఏదైనా ఉత్పత్తుల్ని గ్రాండ్ గా లాంచ్ చేయటానికి కోట్లాది రూపాయిలు ఖర్చు చేసే సంస్థలు చాలానే ఉన్నాయి. అయితే.. ఇందుకు భిన్నంగా తమిళనాడులో ఇప్పుడో ట్రెండ్ నడుస్తోంది. అది ఏ తరహా వ్యాపారమైనా సరే..కొత్త తరహా ఆఫర్ తో అందరి నోళ్లల్లో నానేలా చేయటమే కాదు.. సదరు షాపులకు వస్తున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఇందుకు వారు ఫాలో అవుతున్న రూపాయి ఫార్ములా బాగా వర్క్ వుట్ అవుతుందంటున్నారు. ఆ మధ్యన చెన్నైలోని ఒక బట్టల షాపు వ్యక్తి.. తన షాపులో ఏ డ్రెస్ అయినా సరే రూపాయి మాత్రమేనని చెప్పి సంచలనం గా మారారు. అయితే.. ఈ అద్భుతమైన ఆఫర్ ను సొంతం చేసుకోవటానికి ఒక చిన్న రూల్ పెట్టాడు. అదేమంటే.. తన షాపుకొచ్చే తొలి యాబై మంది కస్టమర్లకే ఈ ఆఫర్ అన్నాడు.

ఇది బంపర్ హిట్ కావటంతో.. తర్వాతి రోజుల్లో రోజుకు వంద మంది మొదటి కస్టమర్లకురూపాయికే డ్రెస్ అనటంతో.. కిలోమీటర్ల కొద్దీ షాపుల ముందు తెల్లవారుజామునే క్యూలు కట్టేవారు. ఇదే విధానాన్ని పలు హోటళ్లు.. ఇతర వ్యాపార సంస్థలు ఫాలో అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. చేపలు అమ్మే షాపు వరకూ వెళ్లింది. తాజాగా తమిళనాడులోని శివగంగ జిల్లా కరైకుడికి చెందిన ఒక వ్యాపారి చేపలు అమ్మే దుకాణాన్ని ప్రారంభించారు.

ప్రజలందరికి తన షాపు తెలిసేలా చేసేందుకు రూపాయి ఆఫర్ ను తెర మీదకు తీసుకొచ్చారు. తన షాపుకు వచ్చే మొదటి వంద మంది కస్టమర్లకు రూపాయికే కిలో చేపలు అమ్ముతానని ఆఫర్ ను ప్రకటించారు. ఇంకేముంది.. రూపాయికే కిలో చేపలు తీసుకునేందుకు వీలుగా.. జనం పోటెత్తారు.

దీంతో.. ఆ ఊళ్లో ఉన్న వారందరికి నాలుగు రోజులకే ఈ షాపు ఫేమస్ కావటమే కాదు.. తొలి వందమందిలో తాము ఉండాలన్న పట్టుదలతో జనం పోటెత్తుతున్న వైనం ఆ షాపు యజమానిని ఆనందానికి గురి చేస్తుంది. తమిళనాడులో అంతకంతకూ పెరుగుతున్నా ఈ రూపాయి ఆఫర్ ను మిగిలిన వారు ఫాలో అయితే.. కోట్లాది రూపాయిల ప్రకటనల ఖర్చు స్థానే.. ఈ ఆఫర్ సూపర్ గా వర్క్ వుట్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.