Begin typing your search above and press return to search.

టీడీపీ సీనియర్ల మౌనం.. కథేంటి?

By:  Tupaki Desk   |   12 July 2019 12:33 PM IST
టీడీపీ సీనియర్ల మౌనం.. కథేంటి?
X
కోడెల శివప్రసాద్ రావు- ప్రత్తిపాటి పుల్లారావు- ధూళిపాల్ల నరేంద్ర- ఆళ్లపాటి రాజా- యరపతనేని శ్రీనివాసరావు.. గుంటూరు జిల్లా టీడీపీలో బలమైన నేతలు వీళ్లు..తొలి నుంచి టీడీపీలో ఉన్న వాళ్లు.. అనాదిగా గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ వాయిస్ ను బలంగా వినిపించేవాళ్లు. ఈ ఎన్నికల్లో ఓడిపోయాక యాక్టివ్ కాకుండా సైలెంట్ గా ఉండడం టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అఖండ మెజార్టీతో గద్దెనెక్కడం.. టీడీపీ నేతల బండారం బయటపెడుతుండడంతో ఎంతో దిగ్గజ నేతలైన వీరు యాక్టివ్ కాకుండా ఉండడం చంద్రబాబును కలవరపాటుకు గురిచేస్తోంది.

మాజీ స్పీకర్ కోడెల కొంచెం దూకుడుగానే రాజకీయం మొదలుపెట్టినప్పటికీ ఆయనపై ‘కే ట్యాక్స్’ పేరిట వరుస ఫిర్యాదులతో అజ్ఞాతంలోనే ఉండిపోతున్నారు. బయటకు రావడానికే ఇష్టపడడం లేదు. ఇక ధూళిపాళ్ల వరుసగా పొన్నూరు నుంచి ఐదు సార్లు గెలిచి ఈసారి ఓడిపోయాడట.. పోయిన సారి మంత్రి పదవి ఇస్తానని బాబు ఇవ్వకపోవడంతో ఆయన అప్పటి నుంచే దూరంగా ఉంటున్నారు. ఈసారి ఓడిపోవడంతో ఇక టీడీపీ వైపే చూడడం లేదట.

ఇక మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లరావు కేవలం కార్యకర్తలను కలుస్తూ చిన్నా పెద్దా మీటింగ్ లకు హాజరవుతూ అంటీముట్టనట్టుగా ఉంటున్నారట..ఇక తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజా పూర్తిగా మౌనంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట..ఇక గురజాల ఎమ్మెల్యే యరపతినేని ఎంతో దూకుడుగా ఉండే నేత. కానీ ఈసారి ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు.

చరిత్రలోనే ఘోర ఓటమిని పొందింది టీడీపీ. చంద్రబాబు ఇటీవలే కోలుకొని మళ్లీ యాక్టివ్ గా అధికార వైసీపీపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. కానీ ఈ గుంటూరు ఉద్దండ నేతలు మాత్రం ఇంకా ఓటమి భారంతోనే సైలెంట్ గా ఉండడం టీడీపీని కలవరపెడుతోందట..