Begin typing your search above and press return to search.

కోవిడ్ డెల్టా వైరస్ ఎందుకింతలా వ్యాపిస్తోంది

By:  Tupaki Desk   |   30 Aug 2021 5:32 AM GMT
కోవిడ్ డెల్టా వైరస్ ఎందుకింతలా వ్యాపిస్తోంది
X
కోవిడ్ -19 డెల్టా వేరియంట్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ డెల్టా వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆల్ఫా వేరియంట్‌ను కంటే వేగంగా విస్తరిస్తోంది. ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల ప్రకారం, డెల్టా వేరియంట్ 2020 చివరిలో భారతదేశంలో మొదటిసారిగా గుర్తించబడింది. గత సంవత్సరం యూకేలో మొదటగా గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే కనీసం 40 శాతం ఎక్కువ వేగంగా విస్తరిస్తూ కబళించేలా తయారైంది. దీనికి ఇప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు.

ఒక అధ్యయనం ప్రకారం.. డెల్టా స్పైక్‌లోని P681R మ్యుటేషన్ ఆల్ఫా-టు-డెల్టా వేరియంట్ స్థానంలో ఎలా కీలక పాత్ర పోషిస్తుందో చూపించింది. "డెల్టా కోవిడ్ వేరియంట్ మానవ ఊపిరితిత్తుల ఎపిథీలియల్ కణాలు..ప్రాధమిక మానవ వాయుమార్గ కణజాలాలలో ఆల్ఫా వేరియంట్‌ను సమర్ధవంతంగా అధిగమించింది" అని టెక్సాస్ విశ్వవిద్యాలయం ఇతరులు పరిశోధకులు తెలిపారు. P681R మ్యుటేషన్ ఫ్యూరిన్ క్లీవేజ్ సైట్ అని పిలువబడే స్పైక్ ప్రోటీన్ తీవ్రంగా వస్తుందని తేల్చారు.

"డెల్టా ముఖ్య లక్షణం ఏమిటంటే.. ట్రాన్స్మిసిబిలిటీ తదుపరి స్థాయికి చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది" అని గాల్వెస్టన్లోని టెక్సాస్ యూనివర్శిటీ మెడికల్ బ్రాంచ్‌లో వైరాలజిస్ట్ పీ-యోంగ్ షి చెప్పారు. "ఆల్ఫా చాలా డేంజర్ అని మేము భావించాము, వ్యాప్తి చెందడం చాలా తక్కువగానే ఉండేది. కానీ డెల్టా మరింత ఎక్కువ అనిపిస్తుంది" అని తెలిపారు. మ్యుటేషన్ సెల్ నుండి సెల్‌కు కోవిడ్ వ్యాప్తిని కూడా వేగవంతం చేస్తుందని అధ్యయనం సూచించింది.

టోక్యో విశ్వవిద్యాలయ పరిశోధకులు P681R మ్యుటేషన్ కలిగి ఉన్న స్పైక్ ప్రోటీన్లు అంటువ్యాధి లేని కణాల ప్లాస్మా పొరలతో కలిసిపోతాయి - సంక్రమణలో కీలక దశ - మార్పు లేని స్పైక్ ప్రోటీన్ల కంటే దాదాపు మూడు రెట్లు వేగంగా ఇవి విస్తరిస్తాయి. ప్రాణాలకు ప్రమాదంగా తయారవుతాయని తేల్చారు. P681R మ్యుటేషన్ ఒంటరిగా ఉండకపోవచ్చని డెల్టా యొక్క స్పైక్ ప్రోటీన్‌లోని ఇతర ఉత్పరివర్తనాలను పరిశీలించడానికి తదుపరి అధ్యయనాలు అవసరమని బృందం సూచిస్తోంది. కాబట్టి ఇప్పుడున్న అన్ని కోవిడ్ వైరల్ వేరియంట్ లకంటే కూడా అత్యంత ప్రభావవంతమైంది.. ఎక్కువ విస్తరించేదిగా డెల్టా వైరస్ వేరియంట్ ను గుర్తించారు.