Begin typing your search above and press return to search.

సమంత జై తెలుగుదేశం... ఎందుకు?

By:  Tupaki Desk   |   10 April 2019 4:00 PM IST
సమంత జై తెలుగుదేశం... ఎందుకు?
X
సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం లేదా రాజకీయ నాయకులకు మద్దతుగా ప్రచారం చేయడం.. లేదా ప్రకటనలు ఇవ్వడం మామూలే. నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడం ఇష్టం లేకపోయినా.. తమకు నచ్చిన వాళ్లకు మద్దతుగా ఫిలిం సెలబ్రెటీస్ అప్పీల్ ఇవ్వడం చూస్తుంటాం. తాజాగా అక్కినేని వాారి కోడలు సమంత తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న రేపల్లె అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్‌ కు మద్దతుగా వీడియో ప్రకటన ఇవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సమంత తెలుగమ్మాయి కాదు. ఇక్కడ ఆమెకు రాజకీయ పరిచయాలు కూడా ఏమీ లేవు. ఇక సమంత మావయ్య నాగార్జున చూస్తే.. వైఎఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికే క్లోజ్. ఆయన పరోక్ష మద్దతు ఆయనకే అనుకోవచ్చు. మరి సమంత టీడీపీ అభ్యర్థికి ఎందుకు ఓటేయమని అడిగింది.. జై తెలుగుదేశం.. జై సైకిల్ అని ఆమె ఎందుకు నినాదం ఇచ్చిందన్నది ఆసక్తికరం.

ఐతే ఇందుకు ఓ బలమైన కారణమే ఉంది. సమంతకు చాలా క్లోజ్ అయిన డాక్టర్ అనగాని మంజులకు సోదరుడే ఈ అనగాని సత్యప్రసాద్. సమంత ఒక సమయంలో అనారోగ్యం పాలైనపుడు మంజులనే ఆమెకు ట్రీట్ చేసి మామూలు స్థితికి తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆమెతో సమంతకు క్లోజ్ బాండ్ ఏర్పడింది. ఆమె పెట్టిన ప్రత్యూష ఫౌండేషన్‌ కు సమంత ఎంతగానో సాయపడటం, ఎందరో పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావడం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ప్రత్యూష ఫౌండేషన్‌ ను గొప్పగా నడిపిస్తున్నారు. వ్యక్తిగతంగా కూడా డాక్టర్ మంజుల చాలా క్లోజ్ అయిన నేేపథ్యంలో ఆమె సోదరుడు సత్యప్రసాద్‌ కు మద్దతుగా వీడియో ప్రకటన ఇచ్చింది సమంత. ఏం చేసినా చాలా మనస్ఫూర్తిగా చేస్తున్నట్లు కనిపించే సమంత.. సత్యప్రసాద్‌ కు మద్దతుగా ఇచ్చిన అప్పీల్‌ లోనూ తన సిన్సియారిటీ చూపించింది.