Begin typing your search above and press return to search.

ఐటీ రైడ్స్ వ్య‌వ‌హారం పై ప‌వ‌న్ సైలెన్స్?

By:  Tupaki Desk   |   15 Feb 2020 11:20 AM GMT
ఐటీ రైడ్స్ వ్య‌వ‌హారం పై ప‌వ‌న్ సైలెన్స్?
X
చంద్ర‌బాబు మాజీ పీఏ పెండ్యాల శ్రీ‌నివాస్ ఇంట్లో ఐటీ శాఖ జ‌రిపిన సోదాలు ఆంధ్రా రాజకీయాల్లో పెనుప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఐఈ సోదాల‌పై ఆ శాఖ విడుద‌ల చేసిన ప్రెస్ నోట్ దుమారం రేపుతోంది. చంద్ర‌బాబు అండ్ కో 2000 కోట్ల రూపాయ‌ల అక్ర‌మ లావాదేవీలు జ‌రిపాయ‌ని స్ప‌ష్ట‌మైన ఆధారాలున్నాయ‌ని ప్ర‌చారం జరుగుతోంది. అయితే, ఏపీలో ఇంత ర‌చ్చ జ‌రుగుతోన్న‌ప్ప‌టికీ...జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మాత్రం స్పందించ‌లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నీతి, నిజాయితీ అంటూ వేదాలు వ‌ల్లించే ప‌వ‌న్ ....చంద్ర‌బాబు పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఎందుకు మౌనంగా ఉన్నార‌న్న ప్ర‌శ్న‌లు తలెత్తుతున్నాయి.

ఈ అవినీతి వ్య‌వ‌హారం పై ప‌వ‌న్ ఎందుకు మాట్లాడ‌డం లేదన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న. ప్ర‌తి విష‌యంలో ప్ర‌శ్నించే ప‌వ‌న్...త‌న గురువు బాబుపై ఆరోప‌ణ‌ల మీద‌ ఎందుకు నోరు విప్ప‌డం లేద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మౌనం అర్ధాంగీకారం టైపులో ప‌వ‌న్ సైలెంట్ గా ఉంటే...బాబుకు స‌పోర్ట్ చేస్తున్న‌ట్లే న‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. టీడీపీని ప‌వ‌న్ వ్య‌తిరేకించ‌డం లేదు కాబ‌ట్టి టీడీపీ అవినీతికి ప‌వ‌న్ వ‌త్తాసు ప‌లుకుతున్నానే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. టీడీపీ హ‌యాంలో క‌ర్నూలులో సంచ‌ల‌నం రేపి బాలిక రేప్, మ‌ర్డ‌ర్‌ కేసుప‌కై మూడేళ్లు గా ప‌వ‌న్ నోరు విప్ప‌లేదు. తాజాగా క‌ర్నూలులో ఆ కేసు గురించి గొంతు చించుకున్న ప‌వ‌న్...క‌నీసం గ‌త టీడీపీ ప్ర‌భుత్వాన్ని ప‌ల్లెత్తు మాట‌న‌లేదు. ఇవ‌న్నీ చూస్తుంటే....బాబు అవినీతిలో ప‌వ‌న్ కూడా భాగ‌స్వామేనా అన్న అనుమానాలు రేకెత్త‌క మాన‌వు.

ఐటీ సోదాల్లో వెలుగులోకి వ‌చ్చిన వాస్త‌వాల ఆధారంగా....మ‌నీ ల్యాండ‌రింగ్....కోణంలోనూ దర్యాప్తు చేప‌ట్ట‌బోతున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈడీ కూడా ఎంట‌ర్ అయి....ఎవ‌రి పేరు మీద లావాదేవీలు జ‌రిగాయ‌నేది నిర్ధార‌ణ చేసుకోనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా వారి ఆస్తులు అటాచ్ చేసే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. శ్రీ‌నివాస్....త్వ‌ర‌లోనే భారీ హ‌వాలా గుట్టుర‌ట్టు చేయ‌నున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏపీకి ఉన్న 3 ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో సింహ‌భాగం చంద్ర‌బాబు జేబులోకి వెళ్లిందని ...బాబుకు అంత‌ర్జాతీయ హ‌వాలాతో క‌నెక్ష‌న్‌లున్నాయని ప్ర‌చారం జ‌రుగుతోంది.