Begin typing your search above and press return to search.
ఆషాఢంలో కొత్త జంట కలయిక ఎందుకు ఉండదు?
By: Tupaki Desk | 27 Jun 2021 9:00 AM ISTఆషాఢం వచ్చిందంటే అందరికీ సంబరమే కానీ కొత్తగా పెళ్లి అయిన జంటకు మాత్రం ఆషాఢం అంటే వామ్మో అంటారు. ఎందుకంటే ఆషాఢంలో కొత్త జంట వేరుగా ఉండాలన్న ఆచారం మన సంప్రదాయంలో ఉంది. కొత్త కోడలు అత్త ముఖం చూడవద్దని.. పుట్టింటికి పంపిస్తారు. ఆ కాలంలో ఆ కొత్త జంట పడే విరహా వేధన అంతా ఇంతాకాదు.
అయితే మారుతున్న కాలంలో చిన్న కుటుంబాల వల్ల, ఉద్యోగాల వల్ల అత్తమామలకు దూరంగానే జంటలు దూరంగా బతుకుతున్నారు. ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లి జీవిస్తున్నారు. దీంతో ఈ సంప్రదాయం తగ్గిపోయింది. అత్తమామ ఉన్న కొత్త కోడలు, అదీ వారింట్లో ఉంటేనే ఈ సంప్రదాయం ఇప్పుడు పాటించాల్సి ఉంటుంది. ఇక అత్తా అల్లుడు కూడా ఎదురు పడకూడదని ఆచారం ఉంది.
ఇక ఇదొక్కటికే ఆచారం కాదు.. ఈ మాసంలో వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా చల్లని వాతావరణం కారణంగా బ్యాక్టీరియా, వైరస్ లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొత్త పెళ్లికూతురు గర్భం దాలిస్తే పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం ఉంటుందనేది అందుకే కొత్త జంటను ఈ నెల దూరం పెట్టారన్నది శాస్త్రీయ నమ్మకం. అందుకే ఈ క్లిష్ట వ్యాధుల కాలంలో కొత్త పెళ్లికూతురు పుట్టింట్లో ఉంటే బెటర్ అని ఈ సంప్రదాయం పెట్టారట..
ఆషాఢంలో కొత్త జంటను దూరం పెట్టడానికి ఒక లాజిక్ కూడా ఉందట.. ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశితో మన తెలుగు సంవత్సరాదిలో తొలి పండుగలు ప్రారంభమవుతాయి. ఆషాఢమాసంతోనే వర్షాలు మొదలవుతాయి. అందరూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటారు. కొత్త జంట ఇంట్లో ఉంటే వ్యవసాయంపై పెళ్లికొడుకు మనసు లగ్నం చేయడని అందుకే పెళ్లికూతురును ఆషాఢంలో పుట్టింటికి పంపుతారు. తద్వారా వ్యవసాయ పనులు ఈనెలలో పూర్తి చేస్తారని పెద్దలు ఈ నియమం పెట్టారని అంటున్నారు..