Begin typing your search above and press return to search.

ఎన్సీపీ ఎమ్మెల్యేల హోటల్ ను ఎందుకు మర్చారు?

By:  Tupaki Desk   |   26 Nov 2019 11:16 AM IST
ఎన్సీపీ ఎమ్మెల్యేల హోటల్ ను ఎందుకు మర్చారు?
X
మహారాష్ట్రలో మలుపులు తిరుగుతున్న రాజకీయ క్రీడలో కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. చకచకా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో భాగంగా శివసేన.. ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీలకుచెందిన ఎమ్మెల్యేలు తమకున్న ఎమ్మెల్యేల బలాన్ని బహిరంగంగా బయటకు ప్రదర్శించటం తెలిసిందే. తమకు మొత్తం 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లుగా చూపించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి 145 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా.. మేజిక్ ఫిగర్ కు మించి 17 మంది ఎమ్మెల్యేలు తమ వద్ద అదనంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

సోమవారం రాత్రి తమ బలాన్ని బహిరంగంగా ప్రదర్శించిన విపక్షం.. తాము మొత్తం 162 మంది సభ్యులమన్న బోర్డుల్ని పెట్టటం ద్వారా తమ బలమెంతన్న విషయాన్ని అందరికి తెలిసేలా చేశారు. ఇదిలా ఉండగా.. గడిచిన కొద్ది రోజులుగా ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఉంచిన ఫైవ్ స్టార్ హోటల్ నుంచి వేరే హోటళ్లకు మార్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకూ ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా హోటల్ రెనైసాన్స్ లో ఉంచారు. అక్కడి నుంచి తాజాగా హోటల్ గ్రాండ్ హయత్.. సోఫిటెల్ లకు తరలించారు. ఎందుకిలా? ఇప్పటివరకూ ఉన్న హోటల్ ను కంటిన్యూ చేయకుండా కొత్త హోటల్లోకి మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయంలోకి వెళితే.. బీజేపీకి చెందిన నేత ఒకరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ ప్రాంగణంలోకి రావటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

దీంతో ముందస్తు జాగ్రత్తగా హోటల్ ను మార్చేస్తూ ఎన్సీపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని సబర్బన్ అంధేరీలోని జెడబ్ల్యూ మారియట్ హోటల్ లో.. శివసేన ఎమ్మెల్యేలను అంధేరిలోని లలిత్ హోటల్ లో బస కల్పించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలను హోటల్ మార్పించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.