Begin typing your search above and press return to search.

చిన‌బాబు..ముంద‌స్తు అంటే ఎందుకంత భ‌యం?

By:  Tupaki Desk   |   27 Jun 2018 5:12 AM GMT
చిన‌బాబు..ముంద‌స్తు అంటే ఎందుకంత భ‌యం?
X
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌లు హాట్ టాపిక్ గా మారాయి. వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌.. మేల‌లో జ‌ర‌గాల్సిన సార్వ‌త్రికం స్థానే.. దాదాపు తొమ్మిది నెల‌ల ముందే ముంద‌స్తును నిర్వ‌హించాల‌ని త‌పిస్తున్నారు ప్ర‌ధాని మోడీ. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సైతం ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన నాటి నుంచి ఎన్నిక‌లు ఎప్పుడైనా స‌రే.. మాకు వోకే అంటూ చెప్పేస్తున్నారు.

అంతేనా.. ఎన్నిక‌లు ఎప్పుడైనా సై అంటూ విపక్షాల‌కు స‌వాల్ విసురుతున్నారు. ఒక‌వైపు ప్ర‌ధాని మోడీ.. మ‌రోవైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లాంటోళ్లు ముంద‌స్తుకు య‌మా ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ ఏపీ రాష్ట్ర మంత్రి లోకేశ్ మాత్రం అందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ముంద‌స్తు ఎన్నిక‌ల మీద తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మే కాదు.. ఏపీలో అధికార‌ప‌క్షం ఎదుర్కొంటున్న ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని లోకేశ్ మాట‌లు మ‌రోసారి స్ప‌ష్టం చేసిన‌ట్లుగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌న్న లోకేశ్‌.. ఐదేళ్లు పాలించ‌టానికి ప్ర‌జ‌లు త‌మ‌కు తీర్పు ఇచ్చిన‌ట్లుగా వ్యాఖ్యానించారు.

నిజ‌మే.. లోకేశ్ చెప్పిన‌ట్లుగా ప్ర‌జ‌లు ఐదేళ్లు పాలించ‌టానికి అవ‌కాశం ఇచ్చారు. ఐదేళ్ల పాల‌న త‌ర్వాతే ఎన్నిక‌ల‌కు వెళ్లటం త‌ప్పేం కాదు. కానీ.. ఈ మాట‌లు లోకేశ్ చెప్పే అర్హ‌త లేద‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడు నీతులు చెబుతున్న లోకేశ్‌.. గ‌తంలో త‌న తండ్రి చేసిన ప‌నిని మ‌ర్చిపోయిన‌ట్లున్నారు. ప్ర‌జ‌లు త‌న చేతికి అధికారం పూర్తి కాక ముందే ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు 2004లో వెళ్ల‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. చిన‌బాబు చెప్పిన‌ట్లుగా ప్ర‌జ‌లు ఐదేళ్లు పాలించేందుకు తీర్పు ఇచ్చిన‌ప్పుడు ముంద‌స్తు వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని తేల్చిన లోకేశ్‌.. గ‌తంలో త‌న తండ్రి ముంద‌స్తుకు వెళ్ల‌టం పైన క్లారిటీ ఇస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ముంద‌స్తు కోసం తెగ ఉత్సాహ‌ప‌డిపోతున్న మోడీ.. కేసీఆర్ తీరుకు భిన్నంగా ఏపీ అధికార‌ప‌క్షం ఉండ‌టానికి కార‌ణం ఆ రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితులేన‌ని చెబుతున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర స్పంద‌న భారీగా ఉండ‌టం.. ఏపీ వ్యాప్తంగా అధికార టీడీపీపై వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెరుగుతున్న నేప‌థ్యంలో ముంద‌స్తుకు వెళితే మొత్తంగా మునిగిపోతామ‌న్న భ‌య‌మే లోకేశ్ చేత అలా మాట్లాడేలా చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏదైనా మాట్లాడే ముందు.. గ‌తంలో ఆయా విష‌యాల్లో త‌న తండ్రి తీసుకున్న నిర్ణ‌యాల మీద అవ‌గాహ‌న‌తో మాట్లాడితే మంచిది. లేకుంటే.. లేనిపోని స‌మ‌స్య‌లు కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంద‌న్న విష‌యాన్ని లోకేశ్ ఎంత త్వ‌ర‌గా తెలుసుకుంటే అంత మంచిద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.