Begin typing your search above and press return to search.
జనసేన సమావేశాల్లో కనిపించని నాగబాబు..!
By: Tupaki Desk | 5 Aug 2019 5:18 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమి తర్వాత పునః సమీక్షా సమావేశాలు పెడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన పూర్తి కమిటీలు లేకుండానే ఎన్నికలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే పవన్ పార్టీ ఘోరమైన ఓటమి మూటకట్టుకుంది. తాజాగా పవన్ తాను ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నరసాపురంలో నిర్వహించారు.
పార్టీ అధినేత స్వయంగా సమావేశం పెట్టడంతో ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో పాటు పలువురు కీలక నేతలు, నాయకులు హాజరయ్యారు. అయితే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు మాత్రం డుమ్మా కొట్టేశారు. ఈ ఎన్నికలకు ముందు జనసేనలో చాలా యాక్టివ్ గా ఉన్న నాగబాబుకు పవన్ నరసాపురం ఎంపీ సీటు ఇచ్చారు. తాను తన పార్టీలో కుటుంబ పాలన చేయనని చెప్పి కూడా నాగబాబుకు ఎంపీ సీటు ఇవ్వడంతో ఎన్నికలకు ముందు తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
ఇక ఎన్నికల్లో పోటీ చేసిన నాగబాబు వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో పాటు ఏకంగా మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు. ఎన్నికల తర్వాత కూడా నాగబాబు పవన్‌ను ఎవ్వరూ ప్రశ్నించవద్దంటూనే సోదరుడికి, సోదరుడి పార్టీకి మద్దతుగా మాట్లాడారు. అయితే ఇప్పుడు మాత్రం నాగబాబు తాను పోటీ చేసిన నియోజకవర్గ సమీక్ష నిర్వహిస్తేనే డుమ్మా కొట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నాగబాబు పార్టీ కార్యకలాపాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న టాక్ కూడా వచ్చింది. వచ్చే ఐదేళ్ల వరకు పార్టీలో ఉన్నా చేసేదేం లేదు. అప్పటి వరకు పార్టీకోసమే పని చేయాలంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తప్పవన్నది నాగబాబు అభిప్రాయమట. అందుకే జస్ట్ అప్పుడప్పుడు పార్టీలో ఉన్నాననిపించుకుంటూనే తన వ్యక్తిగత పనుల్లో నిమగ్నం కావాలనుకుంటున్నాడట.