Begin typing your search above and press return to search.
ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు..దొంగల షాకింగ్ లేఖ !
By: Tupaki Desk | 12 Oct 2021 2:27 PM ISTఈ దొంగ చాలా డీప్ గా హర్ట్ అయ్యాడనుకుంటా .. ఎంతగా నొచ్చుకున్నాడంటే సాటి ఏ దొంగకీ ఈ పరిస్థితి దాపరించకూడదని తిరిగి వెళ్తూ.. తాను వచ్చి వెళ్లినట్లు ఆనవాళ్లు కూడా వదిలివెళ్లాడు. అసలేం జరిందంటే.. దొంగన్నాక కన్నం వేయాలి, ఓ ఇంటికి కన్నం వేయాలంటే కష్టపడి తాళం పగలగొట్టాలి. విలువైన ధనం, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి.. మూడో కంటికి కనిపించకుండా ఉడాయించాలి! మామూలు కష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే దొంగ మాత్రం కొంచెం భిన్నంగా నిజాయితీ పరుడైన డిప్యూటీ కలెక్టర్ ఇంటిని దోచుకోవడానికి ఎంచుకున్నాడు. చాలామంది దొంగలు తమ శ్రమకు తగ్గ ఫలితం రాకపోతే బాధపడతారు కానీ బయటకు చెప్పరు. కానీ భోపాల్‌లోని ఓ ఇంట్లో పడ్డ దొంగలు మాత్రం ఈ రకమైన తమ బాధను ఏ మాత్రం దాచుకోలేదు. ఓ లేఖ రూపంలో తమ బాధను ఇంటి యజమానికి వ్యక్తం చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే..ఇంట్లో తాము ఆశించిన స్థాయిలో ఏమీ లేకపోవడంతో ఇంటి యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న త్రిలోచన్ సింగ్ గౌడ్ అనే డిప్యూటీ కలెక్టర్ ఇంటిపై కొందరు దొంగలు కన్నేశారు. ఆయన ఇంట్లో లేని సమయం చూసి ఆమెలో చోరీకి పాల్పడ్డారు. డిప్యూటీ కలెక్టర్ ఇల్లు కదా, అందులో ఎంతో డబ్బు, ఇతర విలువైన వస్తువులు ఉంటాయని అనుకున్నారు. కానీ లోపల వాళ్లు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది. వాళ్లకు కేవలం రూ. 30 వేల విలువ చేసే వస్తువులు మాత్రమే లభించాయి. దీంతో ఆ దొంగలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. తమ ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారు.
వెంటనే ఓ లేఖ రాసి ఆ ఇంట్లోని టేబుల్ మీద పెట్టారు. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు అంటూ అందులో ఆ దొంగలు రాయడం గమనార్హం. దొంగలు వెళ్లిపోయిన తరువాత ఇంటికి వచ్చిన డిప్యూటీ కలెక్టర్, ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి తన ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. అదే సమయంలో తన ఇంట్లో ఆ దొంగలు రాసి లేఖను చూశారు. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముందనేగా మీ సందేహం! ‘మీ ఇంట్లో డబ్బు లేనప్పుడు తాళం వేయడం ఎందుకు కలెక్టర్?’ అని ఆ నోట్‌లో రాసి ఉంది. ఈ హాస్యాస్పదమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా, త్రిలోచన్ గౌర్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో తాజాగా చోటుచేసుకుంది. ఈ ఇంటి సమీపంలోనే పోలీసు సూపరింటెండెంట్ ఇల్లు కూడా ఉంది. ఇంత సాహసోపేతమైన పనికి ఒడిగట్టిన దొంగ, అతను రాసిన ఉత్తరం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐతే లోకల్ అథారిటీస్ మాత్రం దీనిని ఒక ఛాలెంజ్‌గా స్వీకరించి, ఆ ఘరానా దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా వెతుకుతున్నారు.